Vivo T5 Pro 5G : కొంటే వివో ఫోన్ కొనాలి.. 9020mAh బ్యాటరీతో వివో T5 ప్రో 5G భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ మళ్లీ జన్మలో రాదు!
Vivo T5 Pro 5G : వివో నుంచి వివో టీ5 ప్రో 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్ ద్వారా అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Updated on- May 15, 2026 / 09:08 PM IST
Vivo T5 Pro 5G ( Image Credit : AI )
- వివో టీ5 ప్రో 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే
- వివో ఫోన్ ప్రారంభ ధరపై రూ. 3వేల వరకు తగ్గింపు
- ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 29,999కే లభిస్తోంది
Vivo T5 Pro 5G : వివో ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. వివో T5 ప్రో 5G ఫోన్ ధర భారీగా తగ్గింది. ఇటీవల లాంచ్ ఈ వివో ఫోన్ (Vivo T5 Pro 5G) ప్రారంభ ధరపై రూ. 3వేల వరకు తగ్గింపుతో లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు ఫ్లిప్‌కార్ట్, విజయ్ సేల్స్ ఈ ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి.
భారత మార్కెట్లో వివో T5 ప్రో మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ +256GB ఉన్నాయి. ఈ వివో ఫోన్ ప్రారంభ ధర రూ. 31,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్ రూ. 29,999కే లభిస్తోంది. ఈ వివో ఫోన్ కొనుగోళ్లపై రూ. 1,975 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
రూ. 2,500 వరకు తక్కువ ధరకే :
విజయ్ సేల్స్ ఆఫర్లతో ఈ వివో ఫోన్‌ను రూ. 2,500 వరకు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.
ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. IP68, IP69 రేటింగ్‌తో కూడా వస్తుంది. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 9020mAh బ్యాటరీ కూడా ఉంది.
ఈ వివో ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ఓఎస్ (OriginOS)పై రన్ అవుతుంది.
