BSNL Recharge Plan : BSNL అత్యంత చౌకైన వార్షిక ప్లాన్ : 300 రోజుల వ్యాలిడిటీతో 32GB హై-స్పీడ్ డేటా.. ధర జస్ట్..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఒకసారి రీఛార్జ్ చేస్తే 300 రోజుల వ్యాలిడిటీ, 32GB హై-స్పీడ్ డేటాను పొందవచ్చు.
BSNL Recharge Plan ( Image Credit : AI )
- బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఇదే
- ఒకసారి రీఛార్జ్ చేస్తే 300 రోజుల వ్యాలిడిటీ
- మే 17వ తేదీ వరకు రీచార్జ్ చేస్తే 5శాతం తగ్గింపు
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. లక్షలాది కస్టమర్ల కోసం తక్కువ ధరలో కొత్త వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 300 రోజుల వ్యాలిడిటీ పీరియడ్‌తో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. దేశమంతటా అన్ లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
ఈ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 1499గా ఉంది. దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కంపెనీ అధికారిక వెబ్సైట్, సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. థర్డ్-పార్టీ రిటైలర్ల ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.
300 రోజుల వ్యాలిడిటీ, 32GB హై-స్పీడ్ డేటా :
ఈ చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దేశమంతటా ఫ్రీ నేషనల్ రోమింగ్, అలాగే అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అదనంగా, ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్, మొత్తం 32GB హై-స్పీడ్ డేటా కూడా పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌పై మే 17వ తేదీ వరకు 5శాతం తగ్గింపు అందిస్తోంది. వినియోగదారులు ఈ ప్లాన్‌ను రూ. 75 తక్కువకే పొందవచ్చు. మరో రెండు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ. 2399 ప్లాన్ కూడా పూర్తి సంవత్సరం వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌పై కూడా 5శాతం తగ్గింపు పొందవచ్చు.
ఈ ప్లాన్ బెనిఫిట్స్ కోసం భారత్ అంతటా అన్లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ ఉన్నాయి. ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఫ్రీ SMS, 2GB హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తుంది.
