Vivo కస్టమర్లకు బంపర్ offer: రూ.60వేల వరకూ బెనిఫిట్‌లు

భారత మార్కెట్లోకి అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న VIVO అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. నవంబరు 29వరకూ కొనసాగనున్న ఈ ప్రత్యేకమైన ఆఫర్ కేవలం భారత్‌లోని కస్టమర్లకు మాత్రమే. కొత్త ఫోన్ కొనుక్కునే వారికి మాత్రమే కాదు. వీవో ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

తమ పాత ఫోన్లు ఇచ్చి రూ.3వేల 999రూపాయల అదనపు బెనిఫిట్‌లు పొందే సదుపాయాన్ని కల్పించింది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు పదిశాతం డిస్కౌంట్ కూడా ఇస్తుంది. వీవో స్టోర్ నుంచి ఫోన్ బుక్ చేసుకుంటే ఒక వెయ్యి వంద రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తుంది. 

అసలు ఈ ఆఫర్ పొందడం ఎలా:
> వీవో అప్ గ్రేడ్ & రివార్డ్స్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
> లొకేషన్ ను సెలక్ట్ చేసుకని క్లెయిమ్ యువర్ రివార్డ్స్ పై క్లిక్ చేయాలి. 
> ఆ తర్వాత వచ్చే స్క్రాచ్ కార్డులో రివార్డు ఏంటో తెలిసిపోతుంది. 
> ఈ రివార్డులను క్యాషిఫై, పేటీఎమ్, క్విక్ సిల్వర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రూ.60వేల వరకూ అందిస్తుంది. 

రివార్డుల్లో ఏం గెలుచుకోవచ్చు:
> ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లో వెయ్యి రూపాయల వరకూ బెనిఫిట్‌లు పొందొచ్చు. 
> రూ.2999విలువ గల బ్లూ టూత్ ఇయర్ బర్డ్స్ దక్కించుకోవచ్చు. 
> క్యాషిఫై ఈ స్టోర్ అనే యాప్ లో కొనుగోలు చేసేందుకు రూ.1,100విలువ గల డిస్కౌంట్ కూపన్లు గెలుచుకోవచ్చు. 
> పేటీఎమ్ నుంచి రూ.60వేల విలువ గల యూబర్, బిగ్ బాస్కెట్, ఓయో, పూమా, మెక్ డొనాల్డ్, యూబర్ ఈట్స్, గానా, అజియో లాంటి ఆఫర్లు వస్తాయి. 
> మేక్ మై ట్రిప్, బుక్ మై షో, లాక్మీ, టైటాన్, యారో, మింత్రా యాప్ లపై రూ.15వేల డిస్కౌంట్ కూపన్లు గెలుచుకోవచ్చు.