Vivo T5x 5G : 7200mAh బ్యాటరీ, AI ఫీచర్లు, 50MP కెమెరాతో వివో T5x 5G అదుర్స్.. ధర మీ బడ్జెట్‌లోనే..!

Vivo T5x 5G : వివో టీ5ఎక్స్ 5జీ ఫోన్ 7200mAh భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లు, 50ఎంపీ కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ధర కూడా మీ బడ్జెట్ లోనే కొనేసుకోవచ్చు.

1/7
Vivo T5x 5G : వివో లవర్స్ మీకోసమే.. వివో కొత్త బడ్జెట్ టీ-సిరీస్ వివో T5x 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ 7200mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, IP68, IP69 రేటింగ్ ఉన్నాయి. ధర, లభ్యత విషయానికి వస్తే.. వివో T5x 5G ఫోన్ మొత్తం 3 స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 6GB + 128GB ధర రూ. 18,999 కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999, టాప్-ఎండ్ వేరియంట్ (8GB + 256GB) ధర రూ. 22,999గా ఉంది.
2/7
ఈ వివో ఫోన్ సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్చి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పార్టనర్ రిటైల్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. ఈ కొత్త ఫోన్‌పై స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్‌బీఐ బ్యాంక్ కార్డులు, యూపీఐతో రూ. 2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
3/7
వివో T5x 5G స్పెసిఫికేషన్లు : వివో T5x 5జీ ఫోన్ 6.76-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. ఈ డిస్‌ప్లేలో అడ్వాన్స్‌డ్ ఐ కంఫర్ట్ మోడ్, టీయూవీ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఉన్నాయి. బీజీఎంఐ ఫ్రీ ఫైర్ వంటి గేమ్‌లలో 60FPS వరకు 3 గంటల పాటు గేమింగ్‌ను అందిస్తుంది.
4/7
చిప్‌సెట్ పరంగా చూస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 15.4 గంటల BGMI గేమింగ్, 93 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 10.7 గంటల లైవ్ స్ట్రీమింగ్, 14.5 గంటల నావిగేషన్‌ అందించగలదు. ఓవర్‌లే నోటిఫికేషన్‌లు, గేమ్ వాయిస్ ఛేంజర్, 4D గేమ్ వైబ్రేషన్ వంటి అదనపు గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి.
5/7
OriginOS 6పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ క్రియేషన్, ఏఐ సెర్చ్, ఏఐ క్యాప్షన్స్ వంటి ఏఐ టూల్స్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. వివో T5x 5జీ ఫోన్ 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో భారీ 7200mAh బ్యాటరీతో వస్తుంది. ఈ వివో ఫోన్ కేవలం 43 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
6/7
కెమెరాల విషయానికొస్తే.. 50MP సోనీ అల్ట్రా-HD ఏఐ ఆధారిత మెయిన్ కెమెరా, 2MP బోకె సెన్సార్ ఉంది. ఈ కెమెరా సిస్టమ్ ఫ్రంట్, రియర్ కెమెరాలు రెండింటిలోనూ 4K వీడియో రికార్డింగ్‌ సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-వ్యూ వీడియో ఫీచర్ ఉంది. ఫ్రంట్, రియర్ కెమెరాలతో ఒకే సమయంలో రికార్డింగ్ చేయొచ్చు.
7/7
స్ప్లిట్-స్క్రీన్ కోసం స్క్రీన్ రేషియోను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. పిక్చర్-ఇన్-పిక్చర్ ఫార్మాట్‌ను వాడొచ్చు. ఈ ఫీచర్ వ్లాగింగ్, ట్రావెలింగ్ కు చాలా బెస్ట్. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.