Vivo V17 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ.22వేల 990కు 8GB RAM + 128GB storageతో వస్తుంది. రష్యా కంపెనీ తయారుచేసిన ఫోన్ అదే మోడల్‌తో ఇక్కడకు కూడా రానుంది. మల్టీ టర్బో మోడ్, వాయీస్ ఛేంజర్, ఏఆర్ స్టిక్కర్స్ ఫీచర్లు ఇన్ బిల్ట్ గా వస్తున్నాయి.
మిడ్ నైట్ ఓషన్ బ్లాక్, గ్లాసియర్ ఐస్ రంగుల్లో మొబైల్ దొరుకుతుంది. డిసెంబర్ 17నుంచి అమ్మకాలు మొదలవుతాయి. కావాలంటే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అఫీషియల్ వీవో ఇండియా ఈ స్టోర్‌లలో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లతో పాటు మరికొన్ని బ్యాంకు కార్డుల నుంచి కొనుగోలు చేస్తే 5శాతం డిస్కౌంట్ వస్తుంది. అది కూడా డిసెంబరు 31లోపే. దీంతో పాటుగా రూ.12వేల జియో డేటా బెనిఫిట్ కూడా పొందొచ్చు. బజాజ్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీబీ, హోమ్ క్రెడిట్‌లతో ఈఎమ్ఐ ఆఫ్షన్ కూడా దక్కించుకోవచ్చు.
Vivo V17 స్పెసిఫికేషన్స్:
డిస్ ప్లే: 6.44అంగుళాలు
ప్రొసెసర్: Qualcomm Snapdragon 675
ఫ్రంట్ కెమెరా: 32-megapixel
బ్యాక్ కెమెరా: 48-megapixel + 8-megapixel + 2-megapixel + 2-megapixel
ర్యామ్: 8GB
స్టోరేజి: 128GB
బ్యాటరీ కెపాసిటీ: 4500mAh
రి సొల్యూషన్: 1080×2400 pixels