Vivo V30e Launch : మే 2న వివో V30e 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్, భారత్‌లో ధర ఎంత ఉండొచ్చుంటే?

Vivo V30e Launch : బ్యాక్ కెమెరా సెటప్‌లో సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో పాటు గత మోడల్స్ మాదిరిగా ఆరా లైట్ ఫీచర్‌ను కలిగి ఉండవచ్చని కూడా లీక్‌లు సూచిస్తున్నాయి.

Vivo V30e Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త వివో V30e స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది. వచ్చే మే 2న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 17నే భారత మార్కెట్లో వివో T3X స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అంతేకాదు.. వివో V30e ఫోన్ గత ఏడాది ఆగస్టులో భారత్‌లో లాంచ్ అయిన వివో 29eకి అప్‌గ్రేడ్ వెర్షన్.

Read Also : Apple iPhone 13 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 13పై భారీగా ధర తగ్గింపు.. ఇంతకీ, ఈ ఫోన్ కొనాలా వద్దా?

భారత్ మార్కెట్లో ఇప్పటికే ఉన్న వివో V-సిరీస్‌లో వివో వి30 5జీ, వివో వి30 ప్రో 5జీలతో పాటు వి30e చేరనుంది. వివో వచ్చే నెలలో లాంచ్ కానుందని నివేదికలు వెల్లడించాయి. ఈ లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఆన్‌లైన్-మాత్రమే లాంచ్ ఈవెంట్ వీక్షించవచ్చు.

వివో పార్టనర్ టీజర్‌ల ప్రకారం.. వివో V30e కొన్ని డిజైన్ వివరాలను రిలీజ్ చేసింది. డీప్ వైన్ రంగులో స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ ప్యానెల్‌కు కుడివైపున స్ట్రిప్‌తో పాటు బ్యాక్ సైడ్ మాట్టే ఎండ్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. వివో V30e వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ కలిగి ఉండొచ్చు. డ్యూయల్ కెమెరా సెటప్, లైటింగ్ రింగ్ ఫ్లాష్ ఉండనుంది. వివో వి-సిరీస్‌లో ఫొటోలకు సెల్ఫీ రింగ్‌లు, ఫ్లాష్‌లు ఉండవచ్చు.

వివో V30e ఫోన్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
వివో V30e ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్, (Vivo.com) పార్టనర్ ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా విక్రయించనుందని టీజర్‌లు ధృవీకరిస్తున్నాయి. రాబోయే వివో V30e డిస్‌ప్లే, కెమెరా స్పెసిఫికేషన్‌లతో నివేదికలు వెలువడ్డాయి. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. వివో V30e కర్వడ్ 3డీ డిస్‌ప్లే, స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుందని అంచనా. 5,500ఎంఎహెచ్ బ్యాటరీతో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా మారుతుంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో పాటు గత మోడల్స్ మాదిరిగా ఆరా లైట్ ఫీచర్‌ను కలిగి ఉండవచ్చని కూడా లీక్‌లు సూచిస్తున్నాయి.

వివో V30e మొత్తం బ్లూ గ్రీన్, బ్రౌన్ రెడ్ అనే 2 కలర్ ఆప్షన్లలో రానుంది. వి30, వి30 ప్రోలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ డిజైన్ ఫొటోలు లీక్ అయ్యాయి. వివో వి30ఇ డివైజ్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఫన్ టచ్‌ఓఎస్ రన్ అయ్యే క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్‌తోవివో V30e ఫీచర్లతో రానుందని ఊహాగానాలు సూచిస్తున్నాయి.

వివో V30ఇ ధర వివరాలు ఇంకా ధృవీకరించలేదు. గత వెర్షన్ V29e ప్రారంభ ధర మాదిరిగానే ఉండవచ్చు. వివో వి29ఇ ఫోన్ భారత మార్కెట్లో రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ రెండూ 8జీబీ ర్యామ్ కలిగి ఉన్నాయి. అయితే, స్టోరేజీ ఆప్షన్లలో (128జీబీ, 256జీబీ) విభిన్నంగా ఉన్నాయి. భారత్‌లో వివో వి29e ప్రారంభ ధర రూ. 26,999 ఉండగా, హై స్టోరేజీ వేరియంట్ ధర రూ. 28,999 నుంచి అందుబాటులో ఉంది.

Read Also : Vivo T3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారత్‌కు వివో T3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. కేవలం ధర రూ 12,499 మాత్రమే..!

ట్రెండింగ్ వార్తలు