×
Ad

Vivo V50 5G Price : కొత్త వివో V50 5G ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Vivo V50 5G Price : కొత్త వివో V50 5G ధర తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo V50 5G Price

Vivo V50 5G Price : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. కొత్త మిడ్-రేంజ్ వివో స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్‌లు వివో V50 5G ఫోన్ సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. వివో V50 ఫోన్ రూ. 39,999కి తగ్గింపు పొందింది.

Zeiss-ట్యూన్డ్ డ్యూయల్ కెమెరా సెటప్, పెద్ద 6,000mAh బ్యాటరీ, అల్ట్రా స్లిమ్ స్టైలిష్ ఫారమ్ ఫ్యాక్టర్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను (Vivo V50 5G Price) అందిస్తుంది. ఇప్పుడు, కస్టమర్‌లు ఈ వివో ఫోన్ రూ. 31,500 లోపు ధరకు పొందవచ్చు. మీకు ఆసక్తి ఉంటే.. అమెజాన్‌లో వివో V50 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో వివో V50 5G ధర :
వివో V50 5G ఫోన్ ధర అసలు ధర రూ.39,999 నుంచి ఇప్పుడు రూ.32,999కి తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో కస్టమర్లు తమ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,050 బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. తద్వారా ధర రూ.31వేల కన్నా తక్కువకు పొందవచ్చు. ఫోటోగ్రాఫర్‌లకు అద్భుతమైన డీల్‌ అని చెప్పొచ్చు.

Read Also : Samsung Galaxy S24 Price : కొత్త శాంసంగ్ ఫోన్ ఆఫర్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అతి చౌకైన ధరకే కొనేసుకోండి.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!

కస్టమర్లు నెలకు రూ.1600 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ల నుంచి కూడా ఎంచుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, బ్యాంక్ అవసరాలను బట్టి ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వర్తించవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, బ్రాండ్‌ను బట్టి రూ.31,349 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌టెండెడ్ వారంటీ, మొబైల్ ఫుల్ ప్రొటెక్షన్ వంటి ప్లాన్ కూడా పొందొచ్చు.

వివో V50 5G స్పెసిఫికేషన్లు :
వివో V50 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ అందిస్తుంది. ఈ వివో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది. 12GB LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ OISతో కూడిన Zeiss-బ్యాక్డ్ 50MP మెయిన్ కెమెరా, 50MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.