Vivo X200 Ultra Launch : వివో X200 అల్ట్రా ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ లీక్.. భారత్‌కు ఈ మోడల్ వస్తుందా?

Vivo X200 Ultra Launch : వివో X200, వివో X200 ప్రో వెర్షన్ ఇప్పటికే భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. మెరుగైన ఫీచర్లతో అల్ట్రా మోడల్ ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Vivo X200 Ultra launch timeline leaks

Vivo X200 Ultra Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఇప్పటికే వివో X200 సిరీస్ లాంచ్ అయింది. అందులో ప్రధానంగా వివో X200 ధర రూ. 64,999, వివో X200 ప్రో వెర్షన్ ధర రూ. 94,999కు విడుదల అయ్యాయి. అయితే, మెరుగైన ఫీచర్లతో అల్ట్రా మోడల్ ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు వేరియంట్ల కన్నా అధిక ధర ఉండవచ్చు. ప్రస్తుతానికి, భారతీయ వినియోగదారులు ఈ అల్ట్రా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ పొందే అవకాశం ఉండకపోవచ్చు.

Read Also : iPhone 15 Plus Price Drop : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ ధరపై భారీ తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

వివో ఎక్స్200 సిరీస్ బేసిక్, ప్రో మోడల్‌లతో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. మెరుగైన కెమెరా పర్ఫార్మెన్స్ కోసం ట్రాక్షన్ పొందుతోంది. ఇప్పుడు హై-ఎండ్ వివో ఎక్స్200 అల్ట్రా వైపు మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. డిజిటల్ చాట్ స్టేషన్ (DCS) అని పిలిచే టెక్నాలజీ టిప్‌స్టర్ ప్రకారం.. అల్ట్రా వేరియంట్ చైనాలో ఏప్రిల్ 2025 నాటికి లేదా బహుశా మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వివో X200 అల్ట్రా భారత్‌లో లాంచ్ అవుతుందా? :
భారతీయ వివో అభిమానులకు ఈ వార్త ఆశాజనకంగా లేదు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్‌తో సహా పరిశ్రమ వర్గాలు వివో X200 అల్ట్రా ఫోన్ ముందున్న వివో X100 అల్ట్రా ఫోన్ అనుసరించి చైనీస్ మార్కెట్‌కు ప్రత్యేకంగా ఉంటుందని సూచించాయి. అయినప్పటికీ, భారత్‌లో స్టాండర్డ్, వివో ప్రో మోడళ్లకు డిమాండ్ పెరగడం వల్ల వివో తన వ్యూహాన్ని మార్చుకునేలా కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఇది అసంభవం అనే చెప్పాలి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X200 అల్ట్రా ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో ప్రో మోడల్ ఆకట్టుకునే కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని పుకార్లు సూచిస్తున్నాయి. బిగ్ ఎపర్చర్లు, 5ఎక్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) వంటి సూక్ష్మమైన అప్‌గ్రేడ్‌లు కూడా ఉండనున్నాయి.

Vivo X200 Ultra launch timeline  

ఈ వివో ప్రో ఫోన్ మాదిరిగానే 120fps వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వివో ప్రో మోడల్‌లో కనిపించే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 నుంచి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని నివేదించింది. లీక్‌ల ప్రకారం.. 2కె డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్-ప్రో స్పెసిఫికేషన్‌ల కన్నా అప్‌గ్రేడ్ అప్షన్లను అందిస్తాయి.

వివో ఎక్స్200 ధర వివరాలు :
ప్రస్తుతం వివో ఎక్స్200, వివో ఎక్స్200ప్రో ధరలు వరుసగా రూ.64,999, రూ.94,999 ఉంటాయి. వివో అల్ట్రా మోడల్ లాంచ్ అయితే.. వివో ప్రో వేరియంట్ ధరను మించిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకూ వివో అల్ట్రా మోడల్ గురించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భారతీయ యూజర్ల కోసం వివో ప్రాంతీయపరంగా ప్లాన్‌లను మార్చకపోతే, అభిమానులు స్టాండర్డ్, ప్రో వేరియంట్‌ల మధ్య ఎంచుకునేందుకు అల్ట్రా మోడల్ అందుబాటులో ఉండకపోవచ్చు.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!