Vivo X300 E Launch : వివో లవర్స్ మీకోసమే.. కొత్త వివో X300 E వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు ఇవే.. ప్రీ ఆర్డర్ సేల్స్..

Vivo X300 E Launch : వివో నుంచి సరికొత్త ఎక్స్30 ఇ ఫోన్ రాబోతుంది. లాంచ్ కు ముందుగానే ప్రీ ఆర్డర్ సేల్ ప్రారంభమైంది. కీలక ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.. పూర్తి వివరాలివే..

Vivo X300 E Launch

  • వివో X300 Eలో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 3nm చిప్‌సెట్‌ సెటప్
  • 50MP ప్రైమరీ కెమెరా సెటప్, జూలై 27 నుంచి ఫస్ట్ సేల్

Vivo X300 E Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ వివో X300 E ఫోన్ వచ్చేస్తోంది. ఇప్పుడు కంపెనీ వివో అధికారిక సైట్‌లో వివో X300 E ప్రీ-సేల్స్‌ను ప్రారంభించింది. ఇందులో జైస్ (Zeiss) ఇమేజింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఫోన్ జూలై 27 నుంచి అమ్మకానికి రానుంది.

ఈ ఫోన్ డిజైన్, ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన వివో X300 ఎఫ్ఈ కన్నా భిన్నంగా ఉంది. కానీ, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరాలు, మెటల్ ఫ్రేమ్ ఉన్నాయి. ఈ ఫోన్ మోడల్ నంబర్ V2612A కాగా, నెట్‌వర్క్ యాక్సెస్ లైసెన్స్‌పై కనిపించింది. వివో ఎక్స్300ఇకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి చూద్దాం..

వివో ఎక్స్300ఇ లాంచ్ ఎప్పుడంటే? :
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్300ఇ వచ్చే వారం జూలై 27న లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్ ఇప్పుడు వివో అధికారిక సైట్‌లో ప్రీ-సేల్స్ కోసం అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, నారెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వివో X300ఇ స్పెసిఫికేషన్లు (అంచనా) :
వివో X300ఇ ఫోన్‌లో 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్ 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో అడ్రినో 829 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 3nm చిప్‌సెట్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 12GB, 16GB LPDDR5X అల్ట్రా ర్యామ్ 256GB, 512GB, 1TB UFS 4.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంటాయి.

Read Also : Samsung Galaxy S25 FE 5G : 50MP కెమెరాతో ఈ శాంసంగ్ ఫోన్ జస్ట్ రూ. 22,000 తక్కువకే.. ఈ డీల్ మిస్ చేయొద్దు!

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS6పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 7015mAh బ్యాటరీ కూడా ఉంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వివో ఎక్స్300ఇలో ఎఫ్/1.57 అపర్చర్ ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, f/2.65 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. 7.99 మిమీ మందం, 203 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, USB టైప్-C, USB టైప్-C 2.0, NFC ఉన్నాయి.