×
Ad

Vivo X300 Series : కొత్త వివో X300 సిరీస్ వచ్చేసిందోచ్.. 200MP కెమెరాతో మొత్తం 2 ఫోన్లు.. ధర ఎంతంటే? ఆఫర్లు ఇవే..!

Vivo X300 Series : వివో X300 సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్‌లో 2 ఫోన్‌లు పవర్‌ఫుల్ ఫీచర్లతో వస్తున్నాయి. 16GB వరకు ర్యామ్ అందిస్తున్నాయి. ఈ వివో ఫోన్లకు సంబంధించి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Vivo X300 Series

Vivo X300 Series : వివో X300, వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లు మీడియాటెక్ కొత్త డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. ఇందులో Zeiss నుంచి అప్‌గ్రేడ్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.

వివో X300 సిరీస్‌లో ఈ కొత్త మోడల్స్ మెరుగైన కెమెరా క్వాలిటీని కలిగి ఉన్నాయి. భారీ బ్యాటరీలను కూడా కలిగి ఉంటాయి. వైర్డు వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తాయి. వివో ఫోన్‌లు 16GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీతో వస్తాయి. వివో ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివో ప్రో బిగ్ స్క్రీన్ :
ఫీచర్ల విషయానికొస్తే.. వివో X300 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 8T ఎల్టీపీఓ డిస్‌ప్లే కలిగి ఉంది. HDR10+ డాల్బీ విజన్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

వివో ప్రో 90W వైర్డు ఛార్జింగ్‌ వేరియంట్ :

ఈ వివో ఫోన్ 6,510mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6తో రన్ అవుతుంది.

వివో ఫోన్‌లో 4 కెమెరాలు :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ వివో సిరీస్ ప్రో వేరియంట్‌లో గింబాల్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్ ఉంది. ఇందులో 50MP అల్ట్రావైడ్ లెన్స్ 200MP శాంసంగ్ HPB టెలిఫోటో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీల విషయానికి వస్తే.. 50MP శాంసంగ్ JN1 సెన్సార్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 6.0, USB-C 3.2, Wi-Fi 6తో వస్తుంది.

వివో X300 డిస్‌ప్లే :
Vivo X300 ఫోన్ 6.31-అంగుళాల 8T ఎల్టీపీఓ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్‌ కలిగి ఉంది. వివో ప్రో వేరియంట్ బ్యాటరీ కొంచెం చిన్నది. 6,040mAh బ్యాటరీతో వస్తుంది. 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. 200MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 200MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కూడా 50MP కలిగి ఉంది.

Read Also : Oppo A6x 5G Launch : ఒప్పోనా మజాకా.. ఒప్పో కొత్త A6x 5G ఫోన్ అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ :
వివో X300, వివో X300 ప్రో రెండూ మీడియాటెక్ కొత్త డైమన్షిటీ 9500 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతాయి. ఈ ప్రాసెసర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్పీడ్ యాప్ లోడింగ్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ వివో ఫోన్‌లు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68+IP69 రేటింగ్‌ కూడా పొందాయి.

వివో X300 ఫోన్ 3 వేరియంట్లు లాంచ్ :

వివో X300 ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 75,999, 12GB ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.81,999, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.85,999కు పొందవచ్చు.

వివో X300 ప్రో ధర ఎంతంటే? :
వివో ప్రో వేరియంట్ ధర రూ. 109,999. ఇందులో 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లు ఈరోజు ప్రారంభమవుతాయి. రెండు ఫోన్‌లు డిసెంబర్ 10న అమ్మకానికి వస్తాయి. ఈ సేల్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అనేక డిస్కౌంట్లు ఉన్నాయి.

వివో ఫోన్లు అనేక కలర్ ఆప్షన్లలో వస్తాయి. వివో X300 మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ సమ్మిట్ రెడ్, ప్రో వేరియంట్ ఎలైట్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ వివో X300 ఫోన్‌తో పాటు కంపెనీ వివో ZEISS 2.35x టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్‌ కూడా రిలీజ్ చేసింది. వివో X300 ఫోన్ ధర రూ.18,999కు పొందవచ్చు. ఈ వివో ఫోన్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివో అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు.