Vivo X500 Pro Max : డిస్‌ప్లేలో వివో కొత్త ప్రయోగం.. 2K స్క్రీన్.. 200MP కెమెరా.. వివో X500 ప్రో మ్యాక్స్ ఇదేనా?
Vivo X500 Pro Max : వివో X500 ప్రో మ్యాక్స్‌లో 6.85-అంగుళాల BOE Q11 2K డిస్‌ప్లే, 200MP Zeiss కెమెరా, 2nm మీడియాటెక్ చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. పూర్తి ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- August 29, 2026 / 07:12 PM IST
Vivo X500 Pro Max
- వివో X500 ప్రో మాక్స్‌లో BOEQ11 2K జైస్ మాస్టర్ కలర్ డిస్‌ప్లే
- ఈ డిస్‌ప్లేలో అండర్-డిస్‌ప్లే మల్టీస్పెక్ట్రల్ సెన్సార్ ఆప్షన్
- అతి త్వరలో లాంచ్ కానున్నట్లు కంపెనీ వెల్లడి
Vivo X500 Pro Max : వివో లవర్స్ పండగ చేస్కోండి. వివో ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్ ఎంట్రీకి రెడీగా ఉంది. వివో ఎక్స్500 ప్రోతో పాటు ఎక్స్500 ప్రో మ్యాక్స్‌ను కూడా లాంచ్ చేయనున్నట్టు కంపెనీ హింట్ ఇచ్చింది.
అధికారిక లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. దాంతో కొనుగోలుదారుల్లో ఈ ఫోన్‌పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ ఈ వివో ఫోన్ ఏయే ఫీచర్లతో రాబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2K స్క్రీన్‌తో డిస్‌ప్లేనే అసలు ట్విస్ట్ :
లేటెస్ట్ డేటా ప్రకారం.. వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్‌లో 6.85-అంగుళాల BOE Q11 2K Zeiss మాస్టర్ కలర్ డిస్‌ప్లే ఉండనుంది. ఈ ప్యానెల్‌ను వాడే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదేనట. కొత్త Q11 లూమినెసెంట్ మెటీరియల్ కారణంగా స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. మోషన్ బ్లర్‌ను ఏకంగా 93 శాతం వరకు తగ్గించనున్నట్లు వివో వెల్లడించింది.
Read Also : Vivo Y31t vs Realme 16x 5G : ఒకే ధర.. రెండు 5G ఫోన్లు.. రూ.25,999 బడ్జెట్‌లో ఏది కొనాలి? ఫుల్ డిటెయిల్స్
అద్భుతమైన అప్‌గ్రేడ్ అంటే ఇదే.. చిప్-లెవల్ DEMURA టెక్నాలజీ, వివో సొంత పిక్సెల్-లెవల్ కాంపెన్సేషన్ అల్గారిథమ్‌తో కలర్ యూనిఫార్మిటీ 43 శాతం, బ్రైట్‌నెస్ యూనిఫార్మిటీ 22 శాతం మెరుగుపడుతుందని కంపెనీ చెబుతోంది.
2K రిజల్యూషన్.. బ్యాటరీపై లో-బర్డన్ :
రిజల్యూషన్ పెంచినా పవర్ వినియోగం తగ్గడం ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్. గతంలో 1.5K డిస్‌ప్లేతో పోలిస్తే కొత్త స్క్రీన్ 21 శాతం తక్కువ పవర్ తీసుకుంటుంది. లైఫ్ టైమ్ కూడా రెట్టింపు అయ్యిందని వివో చెబుతోంది. ఆటో బ్రైట్‌నెస్ కోసం హై-ప్రెసిషన్ అండర్-డిస్‌ప్లే మల్టీస్పెక్ట్రల్ సెన్సార్ అందిస్తోంది.
కెమెరా, ప్రాసెసింగ్ విషయానికి వస్తే..
తగ్గేదేలే అన్నట్లుగా 200MP Zeiss APO సూపర్ టెలిఫోటో కెమెరా, 2nm మీడియాటెక్ డైమన్షిటీ చిప్‌సెట్, OriginOS 7 వంటి ఫీచర్లు టీజ్ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. స్క్రీన్ టెక్నాలజీ నుంచి కెమెరా వరకు వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌గా చెప్పొచ్చు.
