Vivo X500 Series : వివో లవర్స్ గెట్ రెడీ.. 144Hz డిస్‌ప్లే, అల్ట్రాసోనిక్ స్కానర్‌తో వివో X500 సిరీస్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్..!

Vivo X500 Series : వివో X500, వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్ మోడళ్లతో వివో X500 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు వివో రెడీ అవుతోంది. పూర్తి ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..

Vivo X500 Series

  • వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 
  • మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్‌ ఉండొచ్చు
  • ఈ వివో  ప్రోలో డియాటెక్ డైమన్షిటీ 9600 ప్రో ప్రాసెసర్ 

Vivo X500 Series : వివో ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త.. అతి త్వరలో కొత్త వివో సిరీస్ ఫోన్ రాబోతుంది. వివో నుంచి వివో X500, వివో X500 ప్రో, వివో X500 ప్రో మాక్స్ మోడళ్లతో వివో X500 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతున్నట్టు సమాచారం.

ఇటీవల లీక్ డేటా ప్రకారం.. వివో ఎక్స్500 సిరీస్ డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ సిరీస్‌లో 2K రిజల్యూషన్‌తో 6.83-అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని అంచనా.

అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 144Hz రిఫ్రెష్ రేట్, 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయని భావిస్తున్నారు. వివో X500 సిరీస్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివో X500 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే? :
వివో గత లాంచ్ బట్టి చూస్తే.. వివో X500, వివో X500 ప్రో ఈ ఏడాదిలో అక్టోబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read Also : Meta Layoffs : మెటాలో భారీగా ఉద్యోగాల కోత.. ఇది పుకారు కాదు.. అసలు నిజాన్ని బయటపెట్టిన మెటా.. ఏకంగా 8వేల మంది ఇంటికి?

వివో ఎక్స్500 సిరీస్ (లీక్) :
వివో X500 సిరీస్ డిస్‌ప్లే సైజులను వెల్లడించింది. కానీ, మోడల్ పేర్లను వెల్లడించలేదు. ఈ లైనప్‌లో 1.5K రిజల్యూషన్‌తో 6.37-అంగుళాల ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే మోడల్ ఉంటుందని అంచనా. వివో X500 సిరీస్‌లోని మరో మోడల్‌లో 2K రిజల్యూషన్‌తో 6.85-అంగుళాల ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్‌ప్లే ఉండగా, మూడో మోడల్‌లో 1.5K రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.

అన్ని మోడళ్లలో 144Hz రిఫ్రెష్ రేట్, అథెంటికేషన్ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటాయని అంచనా. వివో X500లో 6.37-అంగుళాల డిస్‌ప్లే ఉండగా, వివో X500 ప్రోలో మరింత పెద్దదైన 6.85-అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది.

వివో X500 సిరీస్ స్పెసిఫికేషన్లు (లీక్) :
ఇటీవలి లీక్ ప్రకారం.. వివో X500 ప్రో మ్యాక్స్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో లాటరల్ ఓవర్‌ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్ (LOFIC) టెక్నాలజీతో సోనీ LYT-838 సెన్సార్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అప్‌గ్రేడ్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉండవచ్చు.

ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా. వివో X500లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 చిప్‌సెట్ ఉంటుందని అంచనా. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఉండవచ్చు.