Vivo Y05e Launch : వావ్.. వివో నుంచి అత్యంత చవకైన కొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Vivo Y05e Launch : వివో కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వివో Y05e ఫోన్ లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్, 5150mAh బ్యాటరీతో ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
- Sreehari A
- Published on- July 12, 2026 / 05:47 PM IST
Vivo Y05e Launch
- ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 8ఎంపీ కెమెరా సెటప్ ఉంది
- IP64 రేటింగ్, మిలటరీ లెవల్ రెసిస్టెన్స్ అందిస్తుంది
- వివో Y05e ఫోన్ 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే
Vivo Y05e Launch : వివో లవర్స్‌కు పండగే.. వివో నుంచి సరికొత్త వివో Y05e చవకైన ఫోన్ వచ్చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వివో Y05e ఫోన్‌లో 6.74-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ HD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. 8జీబీ వరకు ర్యామ్‌కు సపోర్ట్‌తో పాటు యూనిసోక్ T606 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.
అలాగే, ఈ వివో ఫోన్ వర్చువల్ ర్యామ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో బ్యాక్ సైడ్ 8ఎంపీ కెమెరా (Vivo Y05e Launch) ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ IP64 రేటింగ్ అందిస్తుంది. అంతేకాదు.. అనేక రకాల కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వివో Y05e ధర, లభ్యత :
సౌతాఫ్రికాలో వివో Y05e ఫోన్ లాంచ్ చేసింది. అధికారికంగా లాంచ్ కు ముందే ఈ ఫోన్ వొడాకామ్ సౌత్ ఆఫ్రికా అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ ఫోన్ ధర 2,499 రాండ్లు (సుమారుగా రూ. 14,500) ఉంటుంది. ఈ వివో ఫోన్ క్రెస్ట్ టీల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వివో Y05e స్పెసిఫికేషన్లు :
వివో Y05e ఫోన్ 6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 1600 x 720 పిక్సెల్ HD+ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీనిపై ఒరిజిన్OS 6 స్కిన్ ఉంటుంది. యూనిసోక్ T606 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ అందిస్తుంది.
వివో ఫోన్‌లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో 8ఎంపీ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ 5ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందిస్తుంది. IP64 రేటింగ్ కూడా ఉంది. మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది.
ఈ ఫోన్ భారీ 5,150mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi, బ్లూటూత్, USB-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ వివో ఫోన్ బరువు 199 గ్రాములు ఉంటుంది.
