Samsung Galaxy M47 Price : శాంసంగ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. లాంచ్ అయిన వారానికే గెలాక్సీ M47 ధర రూ.8,000 పెంపు!
Samsung Galaxy M47 Price : 8GB+256GB స్టోరేజ్‌తో టాప్-ఎండ్ వేరియంట్ ఇప్పుడు రూ. 41,999కే లభిస్తోంది. అయితే లాంచ్ సమయంలో ధర రూ. 33,999గా ఉండేది. ఏకంగా రూ. 8వేలు పెంపుతో లభిస్తోంది.
Samsung Galaxy M47 Price
- భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ధర రూ. 8వేలు పెరిగింది
- ఈ ఫోన్ 8GB+128GB వేరియంట్ ధర రూ. 36,999కు పెంపు
- 8GB+256GB స్టోరేజ్‌తో టాప్-ఎండ్ వేరియంట్ రూ. 41,999
Samsung Galaxy M47 Price : శాంసంగ్ లవర్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ ధర భారీగా పెరిగింది. ఈ ఫోన్ అమ్మకానికి వచ్చిన రెండు వారాల లోపే ధర అమాంతం పెరిగింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. లాంచ్ సమయంలో ఈ శాంసంగ్ (Samsung Galaxy M47 Price) ఫోన్ ధర రూ. 25,999గా ఉండేది. అయితే, డిస్కౌంట్‌తో ఈ ఫోన్ రూ. 22,999కే లభిస్తోంది. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ధర పెంపు :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ M47 5జీ ఫోన్ ధర రూ. 8వేలు పెరిగింది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ రూ. 25,999 ఉండగా, ఇప్పుడు ధర రూ. 32,999కు పెరిగింది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 7వేలు పెరిగింది.
అదేవిధంగా, ఈ ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 36,999కి పెరిగింది. అయితే లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 28,999గా ఉండేది. అదే సమయంలో 8జీబీ+256జీబీ స్టోరేజ్‌తో టాప్ ఎండ్ వేరియంట్ ఇప్పుడు రూ. 41,999కి లభిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 33,999గా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ ధరను కంపెనీ నేరుగా రూ. 8వేలు పెంచింది. భారీ మొత్తంలో పెంపు చూడటం ఇదే ఫస్ట్ టైమ్..
Read Also : iQOO 15R Deal : కొంటే ఇలాంటి ఫోన్ కొనాలి.. ఐక్యూ 15R భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
కొన్ని వారాలుగా స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. మెమరీ చిప్‌ల కొరత, ర్యామ్ ధరలు నిరంతరం పెరగడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవలే ఒప్పో, వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు తమ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచాయి. కానీ, రూ. 1000 నుంచి రూ. 3000 వరకు మాత్రమే పెరిగాయి.
శాంసంగ్ గెలాక్సీ M47 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ శాంసంగ్ ఫోన్ 6.7-అంగుళాల sAMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. అడ్రినో 710 జీపీయూతో ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 4nm 5జీ చిప్సెట్తో రన్ అవుతుంది.
ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP HDR ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
