Vivo Y500 Pro
Vivo Y500 Pro : వివో లవర్స్ కోసం సరికొత్త వివో Y500 ప్రో వచ్చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సోమవారం (నవంబర్ 10) చైనాలో వివో Y500 ప్రోను లాంచ్ చేసింది. కొత్త వివో Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
1.5K రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే (Vivo Y500 Pro) కలిగి ఉంది. వివో Y500 ప్రో 200MP శాంసంగ్ HP5 సెన్సార్‌ను కలిగి ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68+IP69-రేటెడ్ అందిస్తుంది.
వివో Y500 ప్రో ధర :
వివో Y500 ప్రో ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర సీఎన్‌వై 1,799 (సుమారు రూ. 22వేలు). 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB ర్యామ్, స్టోరేజ్ మోడల్ ధర వరుసగా సీఎన్‌వై 1,999 (సుమారు రూ. 25వేలు), సీఎన్‌వై 2,299 (సుమారు రూ. 28వేలు), సీఎన్‌వై 2,599 (సుమారు రూ. 32వేలు)గా ఉంది. ఈ ఫోన్ ఆస్పిషస్ క్లౌడ్, లైట్ గ్రీన్, సాఫ్ట్ పౌడర్, టైటానియం బ్లాక్ షేడ్స్‌లో లాంచ్ అయింది.
డ్యూయల్-సిమ్ వివో Y500 ప్రో ఆండ్రాయిడ్ 16-ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 94.10 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.67-అంగుళాల 1.5K (1,260×2,800 పిక్సెల్స్) ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో పాటు 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS2.2 స్టోరేజ్‌తో రన్ అవుతుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. వివో Y500 ప్రో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. ఇందులో ఎఫ్/1.88 ఎపర్చర్‌తో 200MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు ఎఫ్/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం ఈ ఫోన్ ఎఫ్/2.45 ఎపర్చర్‌తో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.
వివో Y500 ప్రోలో కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, బ్లూటూత్ 5.4, జీపీఎస్, A-GPS, Beidou, GLONASS, Galileo, QZSS, OTG, Wi-Fi, NavIC, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో ఇ-కంపాస్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫోటోసెన్సిటివ్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
ఈ హ్యాండ్‌సెట్‌లో బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ రికగ్నైజేషన్ సపోర్టు ఉంది. వివో Y500 ప్రో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కొలతలు 160.23×74.51×7.81mm, బరువు 198 గ్రాములు ఉంటుంది.