iPhone Satellite Features : ఎక్కడైనా.. ఎప్పుడైనా కనెక్ట్.. సిగ్నల్ లేకున్నా ఫోన్ కాల్, మెసేజ్.. ఐఫోన్‌లో శాటిలైట్ ఫీచర్లు వస్తున్నాయ్..!
iPhone Satellite Features : మొబైల్ నెట్‌వర్క్ లేనప్పుడు కూడా నావిగేట్ లేదా మెసేజ్ పంపేందుకు ఆపిల్ త్వరలో శాటిలైట్ ఫీచర్లను ఐఫోన్‌కు తీసుకువస్తోంది. ఈ ఫీచర్లు ఎప్పుడు వస్తాయంటే?
iPhone Satellite Features
iPhone Satellite Features : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. రాబోయే రోజుల్లో ఐఫోన్లలో మొబైల్ నెట్‌వర్క్‌తో పనిలేదు.. ఏకంగా శాటిలైట్ తోనే మొబైల్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్ లు పంపుకోవచ్చు.. లొకేషన్ ట్రాకింగ్ చేయొచ్చు.. ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ సరికొత్త శాటిలైట్ ఫీచర్లను తీసుకురాబోతుంది. ఈ ఫీచర్లు ఎలా ఉంటాయి అనేదానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా మీరు అడవిలో లేదా పర్వతాల మధ్య ఉన్నప్పుడు మొబైల్ నెట్‌వర్క్ పనిచేయదు.
సిగ్నల్స్ కవరేజీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మీ స్మార్ట్‌ఫోన్ (iPhone Satellite Features) పనిచేయదు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. కానీ, త్వరలో ఆపిల్ ఈ సమస్యకు చెక్ పెట్టబోతుంది. ఆపిల్ శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీని తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ శాటిలైట్ ఫీచర్ల సాయంతో ఏ నెట్‌వర్క్ అయినా కాల్స్ చేసుకోవచ్చు.. ఎమర్జెన్సీ మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు.
ఆపిల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్‌లను నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఉపయోగించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మొబైల్ నెట్‌వర్క్ లేకపోయినా.. మీరు ఇప్పటికీ మెసేజ్‌లు, మ్యాప్‌లతో కనెక్ట్ అయి ఉండొచ్చు. నెట్‌వర్క్ కవరేజ్‌లో సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్ వంటి దేశంలో ఈ శాటిలైట్ ఫీచర్ అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు.
శాటిలైట్ ఇంటిగ్రేషన్ ఫీచర్లు :
ఆపిల్ ఇంటర్నల్ “శాటిలైట్ కనెక్టివిటీ గ్రూప్” బృందం ఇప్పుడు డివైజ్‌లను నేరుగా శాటిలైట్‌కు కనెక్ట్ చేయడంపై పనిచేస్తోంది. ఇందులో పాత ఎమర్జెన్సీ SOS ద్వారా శాటిలైట్ ఫీచర్, నావిగేషన్ నెట్‌వర్క్ వంటివి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. కొత్త శాటిలైట్ ఫీచర్లలో మెసేజ్‌లు శాటిలైట్ ద్వారా మ్యాప్స్ ఎమ్యులేషన్ ఉన్నాయి. నెట్‌వర్క్ లేని ప్రాంతాలలో కూడా ఐఫోన్ యూజర్లు మ్యాప్‌లను వీక్షించవచ్చు. అలాగే చాట్ చేయొచ్చు.
అత్యవసర వినియోగానికి మాత్రమే కాకుండా రోజువారీ పనులకు కూడా ఐఫోన్ శాటిలైట్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే, భారత్‌లో శాటిలైట్ కనెక్షన్లు కూడా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శాటిలైట్ స్పెక్ట్రం, లైసెన్సింగ్, దేశంలో నిబంధనలు, పార్టనర్ నెట్‌వర్క్ సంసిద్ధత మొదలైనవి. అదనంగా, ఆపిల్-గ్లోబల్‌స్టార్ రిలేషన్ నెట్‌వర్క్ విస్తరణ కూడా భవిష్యత్తులో ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
శాటిలైట్ ఫీచర్ ఎప్పుడు? ఏ మోడల్స్‌కు సపోర్టు? :
ఈ శాటిలైట్ ఫీచర్లు భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో క్లారిటీ లేదు. అయితే, ఐఫోన్ 14 ఆ తర్వాతి మోడల్స్ ఇప్పటికే శాటిలైట్ SOS (ఎమర్జెన్సీ)కి సపోర్టు ఇస్తున్నాయి. ఈ శాటిలైట్ ఫీచర్‌ను త్వరలో కొత్త ఐఫోన్ మోడల్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో విస్తరించనున్నట్లు ఆపిల్ సూచించింది. టెక్స్టింగ్‌తో పాటు ఆపిల్ ఐఫోన్‌లలో 5G NTN సపోర్టు అందించాలని యూజర్లు కోరుతున్నారు. ఎందుకంటే.. సెల్ టవర్లు శాటిలైట్లను ట్యాప్ చేయడం ద్వారా కవరేజ్ బూస్ట్‌ను పొందవచ్చు.
వై-ఫై లేదా సెల్యులార్ కనెక్షన్ లేకుండా మారుమూల ప్రాంతాలలో ఆపిల్ మ్యాప్స్ కోసం శాటిలైట్ కనెక్టివిటీని తీసుకురావాలని కూడా ఆపిల్ యోచిస్తోంది. ఆపిల్ యాప్ తయారీదారులు శాటిలైట్ కనెక్షన్‌లను ఇంటిగ్రేట్ చేసేందుకు APIపై కూడా పనిచేస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఐఫోన్ 18 సిరీస్ లాంచ్, ఐఫోన్ ఫోల్డ్‌తో పాటు ఈ శాటిలైట్ ఫీచర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
