Vivo Y600i Series : వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త మిడ్-రేంజ్ ఫోన్‌.. ఫీచర్లపై భారీ అంచనాలు..!

Vivo Y600i Series : వివో Y500i తర్వాత మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లుగా వివో Y600i Y600i ఏఐ ఎడిషన్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఈ సిరీస్ ఫోన్లు 3C సర్టిఫికేషన్‌లో కనిపించాయి. ఈ ఫోన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published on- September 14, 2026 / 07:58 PM IST

Vivo Y600i Series

  • గూగుల్ ప్లే కన్సోల్ సపోర్ట్ చేసే డివైజ్ లిస్టులో కనిపించాయి
  • 3C సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
  • ఈ వివో ఫోన్ Y500i నెక్ట్స్ జనరేషన్ మోడల్‌గా రాబోతోంది.

Vivo Y600i Series: వివో లవర్స్ గెట్ రెడీ.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో మరో కొత్త సిరీస్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వివో Y600i, వివో Y600i ఏఐ ఎడిషన్ల పేర్లతో రానున్న ఈ ఫోన్లు ఇప్పటికే పలు లిస్టింగ్స్‌లో కనిపించాయి. లేటెస్టుగా చైనా 3సీ సర్టిఫికేషన్ పొందడంతో ఈ ఫోన్లకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ :
3C సర్టిఫికేషన్‌లో వివో V2617A అనే మోడల్ నంబర్‌తో 5జీ స్మార్ట్‌ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనున్నట్లు సర్టిఫికేషన్ వెల్లడించింది. ఇదే మోడల్ నంబర్ గతంలో గూగుల్ ప్లే కన్సోల్ సపోర్టెడ్ డివైస్ లిస్టులో వివో Y600i, Y600i ఏఐ ఎడిషన్ల పేర్లతో కనిపించింది. ఈ 2 ఫోన్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

Read Also : Samsung Galaxy A56 5G : రూ.9 వేలు తగ్గిన శాంసంగ్ 5G ఫోన్.. రూ.35 వేలలో అదిరిపోయే డీల్!

వివో Y600i సిరీస్‌ను కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విడుదలైన వివో Y500iకి నెక్స్ట్ జనరేషన్ మోడళ్లుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వివో Y500iలో 6.75-అంగుళాల 120Hz ఎల్ సీడీ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్, భారీ 7,200mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

అయితే, వివో Y600i సిరీస్‌లో డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి పూర్తి స్పెసిఫికేషన్లు ఇంకా అధికారికంగా రివీల్ కాలేదు. కానీ, లాంచ్ తేదీ, ధరపై కూడా వివో నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.