Vodafone Idea: వోడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్.. ఫ్రీ రీచార్జ్ ప్లాన్
వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 6 కోట్ల తక్కువ ఆదాయం ఉన్న తమ కస్టమర్లకు ఉచితంగా రూ .49 రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఈ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.
- Sreehari A
- Published On : May 19, 2021 / 12:44 PM IST
Vodafone Idea (vi), Voda Idea Offer
Vodafone Idea Recharge Plan: వోడాఫోన్ ఐడియా (Vi) బంపర్ ఆఫర్ ప్రకటించింది. 6 కోట్ల తక్కువ ఆదాయం ఉన్న తమ కస్టమర్లకు ఉచితంగా రూ .49 రీచార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఈ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది.
ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ఒకసారి మాత్రమే రీఛార్జ్ చేసుకునేందుకు వీలుంది. ఈ స్కీమ్ విలువ రూ.294 కోట్లతో ఆరు కోట్ల మంది వినియోగదారులకు అందిస్తోంది. అదనంగా, టార్గెట్ గ్రూపులోని వోడాఫోన్ ఐడియా కస్టమర్లు తమ మొబైల్ సర్వీస్ అకౌంట్‌ను రూ .79 విలువతో రీఛార్జ్ చేసుకోవచ్చు.
తద్వారా దాదాపు రెట్టింపు బెనిఫెట్స్ పొందవచ్చునని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 60 మిలియన్లకు పైగా తక్కువ ఆదాయ కస్టమర్లకు Vi రూ.49 ఉచితంగా అందిస్తోంది. ఈ ప్యాక్ 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.38 టాక్‌టైంతో పాటు 100 MB డేటా అందిస్తుంది.
