Samsung Galaxy S25 Ultra : వావ్.. ఈ శాంసంగ్ అల్ట్రా 5జీపై ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో రూ. 40వేలు తక్కువకే..
Samsung Galaxy S25 Ultra : అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ ప్రారంభమైంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ఫోన్ రూ. 40వేల తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే ఎలా కొనాలంటే?
Samsung Galaxy S25 Ultra
- శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై భారీ తగ్గింపు ఆఫర్
- 6.9-అంగుళాల అమోల్డ్ 2X డిస్ప్లే, 200MP మెయిన్ కెమెరా
- 5000mAh బ్యాటరీ సెటప్, 10MP టెలిఫోటో కెమెరా
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ లవర్స్ కోసం అదిరిపోయే ఆఫర్.. అమెజాన్ ఫ్రీడమ్ డే సేల్ మొదలైంది. ఈ సేల్ సందర్భంగా కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఆఫర్లు, ధర స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలివే..
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ధర ఆఫర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో (Samsung Galaxy S25 Ultra) రూ. 94,999 ధరకు లిస్ట్ అయింది. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై ఫ్లాట్ రూ. 5వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. తద్వారా ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ. 89,999కి తగ్గింది. జనవరి 2025లో రూ. 1,29,999 ధరకు లాంచ్ కాగా ఇప్పుడు ప్రారంభ ధర కన్నా సుమారు రూ. 40వేలు తక్కువకే లభిస్తోంది.
గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ 1400×3120 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 2600 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, 6.9-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 16పై ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
Read Also : Vivo S2 Launch : ఈ వివో ఫోన్ రేంజే వేరబ్బా.. ఫీచర్లే స్పెషల్ అట్రాక్షన్.. ధర జస్ట్ ఎంతంటే?
45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ 200MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా చూస్తే.. ఈ ఫోన్ 162.8 మిమీ పొడవు, 77.6 మిమీ వెడల్పు, 8.2 మిమీ మందం, 218 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, UWB, GPS USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
