Bigg Boss Telugu 10 : నామినేషన్స్‌లో రచ్చరచ్చ.. ముకేశ్, అమన్‌ల మధ్య వాగ్వాదం.. మధ్యలో త్రిగుణ్.. నువ్వు రా అంటే రా అంటే.. ఏదీ అంటే..
Bigg Boss Telugu 10 : ఎప్పటిలాగానే సోమవారం కూడా నామినేషన్స్ హీటెక్కించాయి.
Bigg Boss Season 10 Telugu Day 36 Full Episode nominations Mukesh vs Aman
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఎప్పటిలాగే సోమవారం నామినేషన్స్ పర్వం కొనసాగింది. వైల్డ్ ఫైర్స్‌కి (కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లు) కీలక బాధ్యత అప్పగించారు. ప్రతి రౌండ్ ప్రారంభానికి ముందు ఓ సైరన్ మోగుతుంది. ఓ ఇద్దరు ఓజీ కంటెస్టెంట్లను వైల్డ్ ఫైర్స్ సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇద్దరూ టాస్కులో తలపడాలి. గెలిచిన వారు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం దక్కించుకుంటారు. విజేత చెప్పిన కారణాలతో పాటు నామినేట్ అయిన వారి ఇద్దరి వాదనలు విన్న తరువాత ఒక నామినేషన్‌ను మాత్రమే వైల్డ్ ఫైర్స్ ఆమోదిస్తారు.
మొదటగా శివ వచ్చి.. త్రిగుణ్, రోహిత్‌లను సెలక్ట్ చేశాడు. వీరిద్దరు గేమ్ ఆడగా.. రోహిత్ విజేతగా నిలిచాడు. మనుషులకు మర్యాద ఇవ్వాలని అంటారు.. కానీ అది మీరు పాటించిన తరువాత అది చెప్తే బాగుంటుందని వంశీని నామినేట్ చేశాడు రోహిత్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తరువాత.. ప్రజల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ఆ ఎవిక్షన్ ప్రీ పాస్‌ను మీకు అనుకూలంగా, మీ స్వార్థానికి ఉపయోగించడం అన్నది మీరు చెప్పే దానికి వ్యతిరేకం అని ఝాన్సీని నామినేట్ చేశాడు రోహిత్. వీరి మాటలు విన్న శివ.. వంశీని నామినేషన్ ఒప్పుకున్నాడు.
శ్వేతా నాయుడు వచ్చి.. ముకేశ్, అమన్‌ను సెలక్ట్ చేసింది. వీరిద్దరు గేమ్ ఆడగా.. ముకేశ్ విజేతగా నిలిచాడు. మళ్లీ ఫౌల్ లాంగ్వేజ్‌ను వాడుతున్నావు అని అమన్‌ని ముకేశ్ నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో త్రిగుణ్ రాగా.. నువ్వు ఎవడివా రా నాకు చెప్పేది అంటూ ఇద్దరూ నోరు జారారు. నువ్వు రా అంటే రా అంటా బే అంటే బే అంటా అని అమన్ అన్నాడు. మిగిలినవారు కలుగజేసుకుని నచ్చజెప్పారు.
అనంతరం.. ఎఫర్ట్ పెడుతున్నావు, కానీ ఆటలో ఇంకాస్త ఇన్వాల్మెంట్ చూపిస్తే బాగుంటుంది అంటూ షాలినిని ముకేశ్ నామినేట్ చేశాడు. వీరి మాటలు విన్న శ్వేతా నాయుడు.. అమన్ నామినేషన్‌ను ఒప్పుకుంది.
నీతూ నటరాజ్ వచ్చి.. షాలినీ, వర్షిణిలను సెలక్ట్ చేసింది. వీరిద్దరు గేమ్ ఆడగా.. షాలినీ గెలిచింది. మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అది నాకు అర్థమైంది కానీ.. మీరు మీ స్వార్థం కోసం ఆడుతున్నారు? నన్ను తక్కువ చేసి మాట్లాడారు మీ వల్ల నేను చాలా లోగా అయిపోయాను అని చెబుతూ అంటూ దేబ్జానీని షాలిని నామినేట్ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.
