Hyderabad Vijayawada Highway : హైదరాబాద్ – విజయవాడ హైవే ఆరు లైన్ల విస్తరణ పనులకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుంచి అంటే?
Hyderabad Vijayawada Highway : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు లైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. అయితే, ఈ విస్తరణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
Hyderabad Vijayawada Highway
Hyderabad Vijayawada Highway Expansion : హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–65) విస్తరణకు రంగం సిద్ధమైంది. ఏపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలకు ఈ జాతీయ రహదారి అత్యంత కీలకం. అయితే, ఈ రహదారిపై రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ల కారణంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా పండుగుల సమయాల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లే మార్గంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. అంతేకాక ఈ రహదారిపై వాహనాల రాకపోకల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రమాదాలుసైతం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరులైన్లుగా విస్తరించేందుకు అనుమతి లభించింది. అయితే, రహదారి విస్తరణ పనులకు ముహూర్తం ఫిక్స్ అయింది.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు లైన్ల రహదారిగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. అయితే, ఈ విస్తరణ పనులు 2027 జనవరి నుంచి ప్రారంభించనున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమై విస్తరణ పనులు, రహదారి భద్రతపై చర్చించారు.
రహదారి విస్తరణలో ఆరు ప్రధాన వరుసలతో పాటు సర్వీసు రోడ్లు, జంక్షన్ల మెరుగుదల, సురక్షితంగా రోడ్డు దాటేందుకు అండర్‌పాస్‌లు, అవసరమైన చోట నియంత్రిత ప్రవేశ సదుపాయాలు కీలకంగా మారనున్నాయి. ఇవి పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులతోపాటు సరకు రవాణా రంగానికి కూడా ప్రయోజనం కలగనుంది.
