Vivo S2 Launch : ఈ వివో ఫోన్ రేంజే వేరబ్బా.. ఫీచర్లే స్పెషల్ అట్రాక్షన్.. ధర జస్ట్ ఎంతంటే?
Vivo S2 Launch : వివో లవర్స్ కోసం వివో S2 అదిరే ఫోన్ వచ్చేసింది. మీడియాటెక్ డైమన్షిటీ 7360 టర్బోతో ఆకట్టుకునేలా ఉంది. 50MP సోనీ ప్రైమరీ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. పూర్తి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo S2 Launch
- కొత్త వివో S2 ప్రారంభ ధర రూ. 39,999 మాత్రమే
- ఆగస్టు 11 నుంచి భారత్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం
- 6.83-అంగుళాల 1.5K 120Hz కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో SoC
- 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7,050mAh బ్యాటరీ
- 50MP సోనీ మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా
Vivo S2 Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? వివో ఇండియా నుంచి సరికొత్త వివో S2 ఫోన్ వచ్చేసింది. ఈ కొత్త ఫోన్ డిజైన్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఫీచర్లు కూడా అందిస్తోంది. అమోల్డ్ డిస్ప్లే, భారీ 7,050mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో చిప్సెట్ అందిస్తుంది. స్పెసిఫికేషన్లు, ధర, డిస్కౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో S2 స్పెసిఫికేషన్లు :
వివో S2 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ 3,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ వివో S2 ఫోన్ 4nm ప్రాసెస్‌పై డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 44W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 7,050mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్OS6పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌కు ఏడాది ఎక్స్టెండెడ్ వారంటీ లాంగ్ బ్యాటరీ హెల్త్ ఆప్టిమైజేషన్ లభిస్తుందని వివో చెబుతోంది.
కెమెరా విషయానికొస్తే..
ఈ వివో ఫోన్ 50MP సోనీ ప్రైమరీ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ రియర్ కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే, కెమెరా ఫీచర్లలో డ్యూయల్ వ్యూ వీడియో, ఏఐ ఎరేస్ 2.0, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, సూపర్‌మూన్, టైమ్-లాప్స్ ప్రో మోడ్ ఉన్నాయి.
ఈ వివో ఫోన్ IP68, IP69 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్, మిలిటరీ-గ్రేడ్ మన్నిక, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, గూగుల్‌తో సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్, ఏఐ స్మార్ట్ కాల్ అసిస్టెంట్, ఏఐ క్యాప్షన్స్, సూపర్ డాక్యుమెంట్స్, ప్రైవేట్ స్పేస్, వివో ఆఫీస్ కిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారత్‌లో వివో S2 ధర, తగ్గింపు ఆఫర్లు :
వివో S2 ఫోన్ సిల్క్ వైట్, సఫైర్ బ్లూ రీగల్ బ్రాంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 39,999 నుంచి ప్రారంభమవుతుంది. కాగా, 8GB + 256GB మోడల్ ధర రూ. 49,999గా ఉంది. వివో అధికారిక వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అధీకృత రిటైల్ స్టోర్ల ద్వారా ఆగస్టు 11 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
వివో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, సబ్సిడీతో వి-షీల్డ్ ప్రొటెక్షన్, ఏడాది వరకు ఎక్స్టెండెడ్ వారంటీ, గూగుల్ జెమిని ప్రో యాక్సెస్‌తో 18 నెలల వరకు 5TB క్లౌడ్ స్టోరేజ్, జియో బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
