New Social Media Rule : పోస్ట్ పెట్టే ముందు జాగ్రత్త! ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లో కొత్త రూల్స్.. మీ పోస్ట్‌పై 2 గంటల్లోనే యాక్షన్?
New Social Media Rule : సోషల్ మీడియా కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ నిబంధనల ప్రకారం.. సోషల్ ప్లాట్‌ఫారంలు తమ యూజర్లు పోస్టు చేసిన ఏఐ ఫేక్ కంటెంట్‌ను రెండు గంటల్లోగా డిలీట్ చేయాలి. అలాగే, ఏఐ కంటెంట్‌పై లేబుల్ డిస్ప్లే చేయాలి. ఈ కొత్త రూల్ వల్ల యూజర్లకు బెనిఫిట్ ఏంటంటే?
New Social Media Rule
- సోషల్ మీడియాలో కొత్త రూల్స్ అమల్లోకి
- 2 గంటల్లోనే మీ పోస్ట్ మాయమవుతుందా?
- ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్ యూజర్లకు ఏమి మారనుంది?
- ఇక పోస్ట్ పెట్టే ముందు ఇది తప్పక తెలుసుకోండి
New Social Media Rule : సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీరు పెట్టే ప్రతి పోస్టుపై ఇప్పుడు ట్రాకింగ్ అవుతుంది. మీ పోస్టు ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్ బుక్ , ఎక్స్, యూట్యూబ్ ఎందులో ఉన్నా అది 2 గంటల్లోనే మాయమైపోతుంది.
ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన కారణంగా సాధారణ (New Social Media Rule) వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
24 గంటలు కాదు.. జస్ట్ 120 నిమిషాలే :
ఈ కొత్త నిబంధనలతో ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలు చట్టవిరుద్ధమైన కంటెంట్‌పై గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, అభ్యంతరకరమైన కంటెంట్‌పై ఫిర్యాదు అందిన వెంటనే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ ఈ డెడ్ లైన్ 24 గంటలు ఉండగా ఇప్పుడు కేవలం 2 గంటలకు (120 నిమిషాలు)కే తగ్గించింది.
Read Also : LPG e-KYC : మీది ఏ గ్యాస్ కనెక్షన్?.. HP, Indane, Bharat Gas.. దేనికి e-KYC ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్
అయితే, ఈ కొత్త రూల్స్ ప్రతి సోషల్ మీడియా పోస్టుకు వర్తించవు. ఎవరైనా ప్రముఖులకు సంబంధించి వారి అనుమతి లేకుండా షేర్ చేసిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు, ఏఐతో క్రియేట్ చేసిన డీప్‌ఫేక్‌లు, ఒకరి ఫేస్ లేదా వాయిస్ మార్చి క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్, అలాగే కోర్టు లేదా ప్రభుత్వం చట్టవిరుద్ధమని ప్రకటించిన పోస్టులపై మాత్రమే తక్షణ చర్య తీసుకోవాల్సి ఉంటుంది.
ఇలాంటి కంటెంట్ వైరల్ కాకముందే ప్లాట్ఫారం నుంచి డిలీట్ చేయనుంది. తద్వారా బాధితులకు కలిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏఐ పోస్టులపై నిఘా :
అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో క్రియేట్ చేసిన ఫొటోలు, వీడియోలు, ఆడియోలను పోస్ట్ చేసే సమయంలో పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ సాయంతో జనరేట్ చేసినట్టుగా క్లియర్‌గా వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ రూల్ పాటించని కంటెంట్‌ను ప్లాట్‌ఫారమ్‌లు గుర్తించి వాటర్‌మార్క్ యాడ్ చేయడం లేదా అవసరమైతే డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే, సాధారణ ఫొటో ఎడిటింగ్, కెమెరా ఫిల్టర్లు, రోజువారీ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్లకు ఈ రూల్ వర్తించదు.
డీప్‌ఫేక్, ఆన్లైన్ వేధింపులు, డిజిటల్ నేరాలను వేగంగా అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, ఈ నిబంధనల అమలుతో సోషల్ మీడియాను మరింత సురక్షితంగా మారుస్తాయా? లేక కంటెంట్ మానిటరింగ్ అనేది మరింత కఠినతరం చేస్తాయా? అనేది వేచి చూడాలి..
