Tecno Spark Go 3 Pro : రూ.15,999కే టెక్నో కొత్త ఫోన్.. 13MP కెమెరా, 5200mAh బ్యాటరీ, IP69 రేటింగ్!
Tecno Spark Go 3 Pro : భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 3 ప్రో వచ్చేసింది. 13ఎంపీ కెమెరా, 5200mAh బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఫోన్ ధర ఎంత ఉంది? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Tecno Spark Go 3 Pro
- బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా సెటప్
- మీడియాటెక్ హీలియో G81 చిప్సెట్
- 4GB ర్యామ్, 8GB వరకు వర్చువల్ ర్యామ్
Tecno Spark Go 3 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 3 ప్రో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ స్పార్క్ సిరీస్‌లో సరికొత్త మోడల్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.78-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,200mAh బ్యాటరీ అందించారు. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌తో వస్తుంది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..
భారత్‌లో టెక్నో స్పార్క్ గో 3 ప్రో ధర :
భారత మార్కెట్లో టెక్నో స్పార్క్ గో 3 ప్రో రూ. 15,999 ధరకు (Tecno Spark Go 3 Pro) లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 15,999 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999కు లభిస్తుంది. ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కూడా కొనేసుకోవచ్చు. ఈ టెక్నో ఫోన్ సేల్స్ సెప్టెంబర్ 4న ప్రారంభమవుతాయి.
టెక్నో స్పార్క్ గో 3 ప్రో స్పెసిఫికేషన్లు :
టెక్నో స్పార్క్ గో 3 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ HD+ రిజల్యూషన్‌తో భారీ 6.78-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ ‘దేశ్ జైసా దమ్దార్’ అనే ట్యాగ్‌లైన్‌తో క్యాంపెయిన్ చేసింది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G81 చిప్సెట్తో రన్ అవుతుంది. 4GB ర్యామ్, 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మొత్తం మీద 12GB వరకు ర్యామ్, మైక్రో SD కార్డ్‌తో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్లో 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5,200mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించేందుకు ఏఐ వాయిస్‌ప్రింట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. ఈ ఫోన్ ఐఆర్ బ్లాస్టర్‌తో వస్తుంది. ఇంట్లో రిమోట్ కంట్రోల్‌గా వాడుకోవచ్చు. సౌండ్ కోసం ఈ ఫోన్లో డ్యూయల్ డీటీఎస్ స్పీకర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 194 గ్రాములు ఉంటుంది.
