Vi Family Plan : Vi కొత్త ప్లాన్ అదుర్స్.. ఒకే గ్రూప్‌లో నలుగురు.. ఫ్యామిలీతో డేటా షేరింగ్ ఈజీ.. ఎలాగంటే?
Vi Family Plan : వోడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌తో నలుగురు సభ్యులు డేటా షేర్ చేసుకోవచ్చు. 500MB డేటా ట్రాన్స్ఫర్, ఫ్యామిలీ గ్రూప్ క్రియేషన్, రీఛార్జ్ డిస్కౌంట్ల వివరాలివే..
- Sreehari A
- Published on- October 17, 2026 / 04:50 PM IST
Vi Family Plan Data
- డేటా అయిపోతే కుటుంబ సభ్యుల నుంచి తీసుకోవచ్చు
- డేటా టెన్షన్‌కు చెక్.. విఐ ఫ్యామిలీ ప్లాన్‌తో 500MB షేర్ చేయొచ్చు
- మీ డేటా అయిపోయిందా? మీ ఫ్యామిలీ మెంబర్‌ను అడగండి
Vi Family Plan Data : మొబైల్ డేటా అయిపోయిందా? ఇంట్లోనే కాదు.. ఎక్కడున్నా కుటుంబ సభ్యుల నుంచి డేటా తీసుకోవచ్చు.. ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఫ్యామిలీ ప్లాన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో కుటుంబ సభ్యులు తమ డేటాను ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. అసలు ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Vi ఫ్యామిలీ ప్లాన్ ఏంటి? :
Vi ప్రవేశపెట్టిన ఈ ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ ద్వారా ఒక కుటుంబానికి చెందిన సభ్యులు గ్రూప్‌గా ఏర్పడి తమ డేటాను ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీ ఫోన్లో డేటా అయిపోయి, మీ కుటుంబ సభ్యుడి ఖాతాలో డేటా ఇంకా మిగిలి ఉంటే.. ఆ డేటాను మీకు షేర్ చేయొచ్చు. అత్యవసర సమయాల్లో అదనపు డేటా రీఛార్జ్ అవసరాన్ని తగ్గించేందుకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
ఒక గ్రూప్‌లో ఎంతమంది ఉండొచ్చు? :
ఈ ఫీచర్ ద్వారా ఒక ఫ్యామిలీ గ్రూప్‌లో గరిష్ఠంగా 4 సభ్యులు ఉండవచ్చు. ఒకరు ప్రైమరీ మెంబర్‌గా ఉంటారు. మిగిలిన ముగ్గురిని సెకండరీ మెంబర్లుగా యాడ్ చేయొచ్చు. అయితే, సభ్యులందరికీ ఒకే వ్యాలిడిటీతో యాక్టివ్ Vi ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి.
Read Also : Vivo V40 5G : వారెవ్వా.. రూ.40 వేల Vivo ఫోన్ ఇప్పుడు అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కుటుంబ సభ్యులు ఒకే ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ గ్రూప్‌లోని సభ్యులు డేటాను షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ గ్రూప్ ద్వారా రీఛార్జ్‌లపై డిస్కౌంట్లు కూడా పొందవచ్చు.
ఒకేసారి 500MB డేటా షేరింగ్ :
Vi ఫ్యామిలీ ప్లాన్‌లో ఒక సభ్యుడు మరో సభ్యుడికి ఒకేసారి 500MB డేటాను షేర్ చేయొచ్చు. అయితే, డేటాను షేర్ చేసే వ్యక్తి ఖాతాలో కనీసం 600MB డేటా ఉండాలి.
Vi ఫ్యామిలీ గ్రూప్ క్రియేట్ ఎలా? :
ముందుగా Vi యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులోని ‘Family’ ట్యాబ్‌లోకి వెళ్లి ‘Create Family’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత యాడ్ చేసే మెంబర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి OTP ద్వారా వెరిఫై చేయాలి. గ్రూప్ యాక్టివ్‌గా ఉండాలంటే కనీసం ఇద్దరు సభ్యులు ఉండాలి.
మొత్తంగా, ఫ్యామిలీ సభ్యుల మధ్య డేటా బెనిఫిట్స్ పొందాలంటే వోడాఫోన్ ఫ్యామిలీ ప్లాన్ తప్పనిసరి. అయితే, ఈ బెనిఫిట్స్ పొందాలంటే యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఉండాలి. అప్పుడే ఈ బెనిఫిట్స్ పొందగలరు.
