Watch T20 World Cup
T20 World Cup 2026 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ టోర్నీ మొదలైంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్ ద్వారా మ్యాచ్‌లను డిజిటల్‌గా చూడొచ్చు. ఆసక్తిగల యూజర్లు వరల్డ్ కప్ కోసం జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. Jio, Airtel, Vodafone Idea (VI) యూజర్లు తమ ప్రీమియం కంటెంట్ ఫ్రీగా చూడొచ్చు.
ఈ టెలికం కంపెనీలు జియోహాట్‌స్టార్‌లో ప్రీమియం కంటెంట్‌కు ఫ్రీ యాక్సెస్‌తో పాటు రెగ్యులర్ కాలింగ్, డేటా ఆఫర్లతో ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నాయి. వినియోగదారులు జియోహాట్‌స్టార్‌కు సబ్‌స్క్రైబ్ కాకుండానే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను నేరుగా చూడొచ్చు. టీ20 ప్రపంచ కప్ ఫ్రీగా చూసేందుకు కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
జియో రూ.100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ స్పెషల్ ‘క్రికెట్ డేటా ప్యాక్’. 30 రోజుల వ్యాలిడిటీతో 5GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. స్పెషల్ బెనిఫిట్ ఏమిటంటే.. ఇందులో 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో టోర్నమెంట్‌ను చూసేందుకు ఇదే బెస్ట్ ప్లాన్. డేటా వోచర్ కోసం యాక్టివ్ బేస్ ప్లాన్ కూడా ఉండాలి.
జియో రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఎక్కువ డేటా అవసరయ్యే యూజర్లకు రూ. 195 ప్లాన్ మొత్తం 15GB డేటాను అందిస్తుంది. ఈ వోచర్ 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. మొత్తం T20 ప్రపంచ కప్ చూడాలనుకునే వారికి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్. రాబోయే ద్వైపాక్షిక సిరీస్ ఒరిజినల్ కంటెంట్ కూడా జియోహాట్ స్టార్ లో వీక్షించవచ్చు.
వోడాఫోన్ ఐడియా రూ. 44 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ప్రస్తుతం అత్యంత చౌకైన రూ.44 ప్లాన్ తో 1GB డేటాను అందిస్తుంది. అయితే, జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పూర్తి 30 రోజులు ఉంటుంది.
Read Also : Samsung Galaxy A35 : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ A35పై కిర్రాక్ డిస్కౌంట్.. ఎలాగంటే?
వోడాఫోన్ ఐడియా రూ. 101 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
వోడాఫోన్ ఐడియా రూ.101 ప్లాన్ అనేది 5GB డేటాను అందించే పోటీ ఎంట్రీ-లెవల్ డేటా ప్యాక్. 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. నెల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.
వోడాఫోన్ ఐడియా నుంచి రూ.151 ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీతో 4GB డేటాను అందిస్తుంది. కానీ, 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు ఖర్చు లేకుండా 3 నెలల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.
వోడాఫోన్ ఐడియా రూ. 169 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రూ.169 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో 8GB డేటాను అందిస్తుంది. రూ.151 ప్లాన్ మాదిరిగా జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. రాబోయే 3 నెలల వరకు వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే, డేటా కెపాసిటీ, డేటా లిమిట్‌తో మ్యాచ్ స్ట్రీమింగ్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 100 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రూ.100 డేటా ప్యాక్ యూజర్లకు 30 రోజుల వ్యవధిలో 6GB హై-స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ 30 రోజుల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రపంచకప్ మ్యాచ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. యాడ్-ఆన్ సిమ్ కార్డ్‌లో ఈ డేటా ప్యాక్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 195 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.195 ప్లాన్ 12GB డేటాతో పాటు 30 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లు జియో హాట్‌స్టార్ మొబైల్‌కు నెల సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.