Total Global Population on That Day: మీరు పుట్టిన సమయంలో ప్రపంచ జనాభా ఎంతుందో తెలుసా.. ఒక్క క్లిక్ అంతే

ప్రపంచంలో మనకు తెలియని విషయాల గురించి పని పెట్టుకుని తెలుసుకోలేం కానీ, తెరిచిన పుస్తకంలా చేతివేలి దూరంలో ఉంటే ఎవరు మాత్రం పట్టించుకోకుండా ఉంటారు.

Total Global Population on That Day: ప్రపంచంలో మనకు తెలియని విషయాల గురించి పని పెట్టుకుని తెలుసుకోలేం కానీ, తెరిచిన పుస్తకంలా చేతివేలి దూరంలో ఉంటే ఎవరు మాత్రం పట్టించుకోకుండా ఉంటారు. వేల శతాబ్దాల క్రితం మొదలైన మానవ మనుగడ ఏ సంవత్సరంలో ఎంత ఉందో తెలుసుకోవాలనే కుతూహలం తీరిపోతుంది. దానికోసం చేయాల్సిందల్లా వెబ్ సైట్ లో కావాల్సిన డేట్ ఎంటర్ చేయడమే.

అది డేట్ ఆఫ్ బర్త్… కావొచ్చు. పెళ్లి రోజు కావొచ్చు. లేదా మనకు ప్రత్యేకమైన రోజు ఏదైనా రోజు.. నెల, రోజు, సంవత్సరం ఫార్మాట్ లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. 1500వ సంవత్సరం నుంచి రోజుకు ఎంతమంది పెరిగారనే డేటాను చూపిస్తుంది.

WorldPopulationHistory.org అనే వెబ్ సైట్ లోకి వెళ్లి.. డేట్ ఎంటర్ చేస్తే సెకన్లలో గ్రాఫ్ తో కూడిన చార్ట్ మీ ముందుంటుంది. ఆ రోజున మానవ జనాభా ఎంత ఉందనేది క్షణాల్లో తెలిసిపోతుంది. 5దశాబ్దాల డేటా అర సెకనులో ఫిల్టర్ అయి కనిపిస్తుందన్నమాట. మీకు కావాల్సిన తేదీ జనాభా ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇక్కడ క్లిక్ చేయండి.

………………………………………. : అందుకే రాజీనామా, కేసీఆర్ ఆదేశాలు రాగానే టీఆర్ఎస్‌లో చేరతా

1901లో 23కోట్లు మాత్రమే ఉన్న ఇండియా జనాభా.. ప్రస్తుతం ఎంత ఉందో తెలుసా.. వరల్డ్ వార్ 2 తర్వాత జనాభా ఎంత తగ్గిపోయిందో తెలుసా.. మహమ్మారిల నుంచి ఎదుర్కొని మానవ మనుగడ ముందుకు సాగుతున్న తరుణంలో ప్రపంచ జనాభాలోనూ కొన్ని మార్పులు కనిపించాయనేది ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. డేటా ఆధారంగా మరో 3దశాబ్దాల తర్వాత కూడా జనాభాను అంచనా వేసి చెప్తుంది ఈ వెబ్‌సైట్.

ట్రెండింగ్ వార్తలు