Trump Mobile T1 phone : వారెవ్వా.. ట్రంప్ మొబైల్ T1 వచ్చేస్తోంది.. అసలేంటి ఈ ఫోన్? ఫీచర్లు నెక్స్ట్ లెవెల్, ధరలో బిగ్ ట్విస్ట్!

Trump Mobile T1 phone : ట్రంప్ మొబైల్ T1 వస్తోంది. అతి త్వరలోనే షిప్పింగ్ ప్రారంభం కానుందని ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. అయితే, ఈ ట్రంప్ ఫోన్‌ను గత ఏడాది జూన్‌లోనే ప్రకటించారు. అప్పటి నుంచి అందరూ ట్రంప్ ఫోన్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Trump Mobile T1 phone

  • ట్రంప్ మొబైల్ T1 ఫోన్ ఎట్టకేలకు వచ్చేస్తోంది 
  • అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీ
  • ట్రంప్ మొబైల్ టీ1 షిప్పింగ్ ప్రారంభమంటూ కంపెనీ ప్రకటన
  • ట్రంప్ మొబైల్ టీ1 ఫోన్ ఫీచర్లు, ధర, డెలివరీ వివరాలు

Trump Mobile T1 phone : అమ్మయ్యా.. ఎట్టకేలకు ట్రంప్ ఫోన్ వచ్చేస్తోంది.. ముందుగా బుక్ చేసుకున్న వారి ఎదురుచూపులు ముగిశాయి. డొనాల్డ్ ట్రంప్ పేరుతో తయారైన ‘ట్రంప్ మొబైల్ T1 గోల్డ్’ ఫోన్ ఈ వారం వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

డొనాల్డ్ ట్రంప్ పేరుతో వచ్చే ‘Trump Mobile T1’ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. గోల్డ్ కలర్ డిజైన్, ప్రీమియం (Trump Mobile T1 phone) లుక్‌తో జస్ట్ ఫోన్ కాదు.. స్టేటస్ సింబల్‌లా కనిపిస్తోంది.

అమెరికన్ బ్రాండ్ ఇమేజ్‌తో యువతలో స్టైల్, దేశభక్తి రెండింటినీ టార్గెట్ చేస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్ కొనడమే కాదు.. ఐడెంటిటీ అన్నట్టుగా మార్కెటింగ్ చేయడంతో ఈ ఫోన్ బాగా ట్రెండ్ అవుతోంది. టెక్నాలజీ, పొలిటికల్ బ్రాండింగ్, సోషల్ మీడియా హైప్ అన్ని కలిపి ట్రంప్ మొబైల్ T1 ఫోన్ గురించి భారీగా చర్చ నడుస్తోంది.

నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌ ముందుగా బుక్ చేసుకున్న చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, ఈ ఫోన్ షిప్పింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ‘ఫోన్‌ల షిప్పింగ్ ప్రారంభం’ అంటూ ఫేస్‌బుక్‌లో కంపెనీయే ధృవీకరించింది. గోల్డ్ కలర్ ఆండ్రాయిడ్ ఫోన్, అమెరికా జెండా, ట్రంప్ పేరు ఉంటాయని చెబుతున్నారు.

ట్రంప్ మొబైల్ డెలివరీ పలుమార్లు వాయిదా :
ట్రంప్ మొబైల్ షిప్పింగ్ పదేపదే వాయిదా పడుతూ వస్తోంది. ఈ ట్రంప్ ఫోన్‌ను ఏడాది క్రితమే ప్రకటించారు. ఆ సమయంలో, పూర్తిగా ‘మేడ్ ఇన్ అమెరికా’ ఫోన్ అవుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ‘అమెరికన్ ప్రౌడ్ డిజైన్’గా మార్చారు. కంపెనీ నిబంధనలను బట్టి పరిశీలిస్తే.. ఈ మొబైల్ ఎప్పటికీ తయారవ్వదేమో అనిపించింది. కానీ, ఇప్పుడు షిప్పింగ్ వార్త అందరినీ ఆశ్చర్యపరిచింది.

Read Also : OnePlus 9 5G : వన్‌ప్లస్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. DSLR రేంజ్ కెమెరా, జస్ట్ మీ బడ్జెట్ ధరలోనే!

ట్రంప్ ఫోన్ ఫీచర్లు :
ట్రంప్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఫొటోగ్రఫీ కోసం 50MP మెయిన్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని అంచనా. 5000mAh బ్యాటరీ, 30W క్విక్ ఛార్జింగ్ కూడా ఉండొచ్చు.

ముఖ్యంగా, ఈ ఫోన్‌లో హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండొచ్చు. వైర్డ్ ఇయర్‌ఫోన్‌లతో మ్యూజిక్ వినేవారిని ఆకర్షించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై రన్ అవుతుంది. కానీ, పాత స్నాప్‌డ్రాగన్ 7 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ట్రంప్ ఫోన్‌ను 100 డాలర్ల డిపాజిట్‌తో 499 డాలర్ల ప్రారంభ ధరకు ఆర్డర్ చేయవచ్చు. డివైజ్ ప్రొటెక్షన్ కోసం అదనంగా, 47 ప్లాన్ అన్ లిమిటెడ్ కాలింగ్, టెక్స్టింగ్, డేటా, యూఎస్ నెట్‌వర్క్‌లలో దేశవ్యాప్తంగా కవరేజీని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ప్యాకేజీకి నెలకు 47.45 డాలర్లు ఖర్చవుతుంది.

ట్రంప్ ఫోన్‌ అందరూ ఇష్టపడతారా? :
ట్రంప్ ఫోన్ కోసం చాలామంది కొనగోలుదారులు 100 డాలర్ల డిపాజిట్ చెల్లించారు. ఈ అడ్వాన్స్ పేమెంట్ చేసినా వారంతా ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముందే డబ్బులు చెల్లించినంత మాత్రాన ట్రంప్ ఫోన్ అందుతుందనే గ్యారెంటీ లేదు.

ఇప్పుడు ట్రంప్ ఫోన్ షిప్పింగ్ ప్రారంభమైందని అంటున్నారు. పాత టెక్నాలజీ, పాత డిజైన్‌తో ఉన్న ఈ ట్రంప్ ఫోన్ నేటి మోడ్రాన్ ఫోన్‌లతో పోటీ పడగలదా? లేదో చూడాలి.