WhatsApp Green Colour : మీ వాట్సాప్ గ్రీన్‌‌ కలర్‌లోకి మారిందా? ఈ మార్పునకు కారణమేంటి? యూజర్ల రియాక్షన్ ఇదిగో!

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఈ కొత్త గ్రీన్ కలర్ అప్‌డేట్ వచ్చేసింది. మీ ఫోన్‌లో వాట్సాప్‌ గ్రీన్ కలర్‌లోకి మారిందా? లేదో చెక్ చేసుకోండి.

WhatsApp Green Colour : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్లతో ఆకట్టుకున్న వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ లోగో కలర్ మార్చేసింది. ఇప్పటివరకూ బ్లూ కలర్‌లో కనిపించినా వాట్సాప్ ఇంటర్‌ఫేస్ గ్రీన్ కలర్‌లోకి మారిపోయింది.

Read Also : WhatsApp Passkey : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీ సపోర్టు వచ్చేసింది.. ఎలా సెటప్ చేయాలంటే?

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది యూజర్లకు ఈ కొత్త గ్రీన్ కలర్ అప్‌డేట్ వచ్చేసింది. మీ ఫోన్‌లో వాట్సాప్‌ గ్రీన్ కలర్‌లోకి మారిందా? లేదో చెక్ చేసుకోండి. లేదంటే.. ఏ క్షణమైనా మీ వాట్సాప్ గ్రీన్ కలర్‌లోకి మారవచ్చు. గతంలో వాట్సాప్ రిలీజ్ చేసిన అనేక ఫీచర్లు, అప్‌డేట్స్ వచ్చినా పెద్దగా మార్పులు బయటకు కనిపించేవి కావు.. చాలా సూక్ష్మంగా ఉండేవి.

వాట్సాప్ గ్రీన్ కలర్ నచ్చలేదంటున్న యూజర్లు :
ఇటీవల, వాట్సాప్‌‌లో iOS యూజర్ల కోసం ఇంటర్‌ఫేస్‌లో సూక్ష్మమైన మార్పులను చేసింది. సాంప్రదాయ బ్లూ కలర్ బదులుగా గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చింది. ఈ మార్పు ఫిబ్రవరిలోనే ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు భారతీయ యూజర్లకు కూడా కొత్త అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై వాట్సాప్ యూజర్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వాస్తవానికి ఈ కొత్త గ్రీన్ కలర్ ఇంటర్‌ఫేస్ నచ్చలేదని అంటున్నారు.

ట్విట్టర్ (X) వేదికగా ఎక్కువ మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఈ మార్పు ఎందుకు చేసినట్టుని యూజర్లు నెగటివ్‌గా స్పందిస్తున్నారు. బ్లూ కలర్ బాగుండేది.. గ్రీన్ కలర్ మార్చడంలో ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. చూసేందుకు డిజైన్ అసలు బాగోలేదని అంటున్నారు. ఏదిఏమైనా వాట్సాప్ చేసిన మార్పు అసలు నచ్చలేదని యూజర్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

వాట్సాప్ ఎందుకు గ్రీన్‌గా మారిందంటే? :
వాట్సాప్ ఈ మార్పులతో యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాట్‌ఫారంపై ఫీచర్లను సులభంగా యాక్సస్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ ఇంటర్‌ఫేస్ కలర్లు, ఐకాన్స్ మరిన్నింటితో సహా గ్రీన్ కలర్ మార్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ iOS యూజర్లు చాలామంది వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను అందుకుంటున్నారు. ఇంటర్‌ఫేస్ సాధారణ బ్లూ కలర్ బదులుగా గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మారింది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కూడా వాట్సాప్ ఇకపై గ్రీన్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఐఫోన్‌లలో కూడా బ్లూ కలర్ మారింది.

WhatsApp Green Now 

స్టేటస్ బాక్సు నుంచి చాట్-లిస్టు విండో వరకు, ప్రతిదీ డిజైన్ మారింది. ఐకాన్‌లతో పాటు, యాప్‌లో షేర్ చేసిన లింక్‌లు కూడా సాధారణ బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్‌లోకి మారిపోయాయి. ఆండ్రాయిడ్ యూజర్లు డార్క్ మోడ్‌లో సూక్ష్మమైన మార్పులను కూడా చూడవచ్చు. వాట్సాప్ ఇంటర్‌ఫేస్ ముదురు రంగులోకి మారింది.

అయితే, లైట్ మోడ్ అదనపు స్పేస్‌తో మెరుగైన రీడబిలిటీని అందిస్తుంది. మీ వాట్సాప్ స్క్రీన్ ఇప్పటికీ బ్లూ-థీమ్‌గా ఉన్నట్లయితే.. యూజర్లందరూ ఇంకా ఈ మార్పును అందుకోలేదని గమనించాలి. అతి త్వరలోనే మీ వాట్సాప్ ఇంటర్‌ఫేస్ కూడా మారవచ్చు. అప్పటివరకూ వేచి చూడాల్సిందే.

Read Also : WhatsApp Face Unlock : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌‌లో కొత్త ఫేస్ అన్‌లాక్ సపోర్టు ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు