WhatsApp Custom Stickers
WhatsApp Custom Stickers : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ 3 బిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. అయితే, వాట్సాప్ యూజర్‌బేస్‌ను మరింత పెంచుకోవడానికి కొత్త ఫీచర్‌లపై పనిచేస్తోంది. వాట్సాప్ యూజర్లు యాప్ నుంచి నేరుగా ఇతర కాంటాక్ట్‌లతో మొత్తం స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయొచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వాట్సాప్‌లో లేటెస్ట్ డేటా ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్ వెర్షన్ 2.24.25.2 ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ఎంచుకోవచ్చు. కస్టమ్ స్టిక్కర్ ప్యాక్‌లను క్రియేట్ చేయొచ్చు. బీటా టెస్టర్‌లు మొత్తం స్టిక్కర్ ప్యాక్‌లను వారి కాంటాక్టులతో షేర్ చేయొచ్చు. టెస్టింగ్ తర్వాత ఈ ఫీచర్ త్వరలో మరింత మంది యూజర్లకు అందుబాటులో ఉంటుందని సూచిస్తున్నారు.
ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. వినియోగదారులు ఏ చాట్‌లోనైనా స్టిక్కర్ పికర్‌ను ఓపెన్ చేయొచ్చు. ప్రతి స్టిక్కర్ ప్యాక్ పక్కన కొత్త త్రి డాట్స్ మెను ఆప్షన్ గుర్తించగలరని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ మెను రెండు ఆప్షన్లను అందిస్తుంది. స్టిక్కర్ ప్యాక్‌ను షేరింగ్ చేయడం లేదా వారి వ్యక్తిగత లైబ్రరీ నుంచి తొలగించడం, షేర్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు సులభంగా స్టిక్కర్ ప్యాక్‌లను స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా గ్రూప్ చాట్‌లకు పంపవచ్చు.
వాట్సాప్ ద్వారా క్రియేట్ చేసిన ఫస్ట్-పార్టీ స్టిక్కర్ ప్యాక్‌ల కోసం షేరింగ్ అధికారిక స్టిక్కర్ స్టోర్‌కు నేరుగా లింక్‌ను రూపొందిస్తుంది. ఈ ప్రక్రియ రిసీవర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో హోస్ట్ చేసిన స్టిక్కర్‌లను వాట్సాప్ మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా స్టోర్ నుంచి ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. అదే సమయంలో, థర్డ్-పార్టీ స్టిక్కర్ ప్యాక్‌లను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చు. కాంటాక్టులు లేదా గ్రూపులతో షేరింగ్ చేయవచ్చు, కస్టమైజడ్ స్టిక్కర్ సెట్‌లను క్రియేట్ చేయడం లేదా కలెక్ట్ చేసే యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కొత్త ఫీచర్ విషయానికొస్తే.. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన బీటా టెస్టర్‌లకు స్టిక్కర్-షేరింగ్ ఫీచర్ పరిమితంగా ఉంది. త్వరలో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లు అందరికి అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను బీటా టెస్టర్‌లకు క్రమంగా అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ టెస్టింగ్ స్టేజీలో ఉందని నివేదిక సూచిస్తుంది. ఈ ఫీచర్‌పై ఆసక్తి ఉన్న యూజర్లు సాధారణ రిలీజ్ కన్నా ముందే యాక్సెస్ చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లోని బీటా ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.
Read Also : Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?