WhatsApp Profile : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక మీ ప్రొఫైల్ ఫొటో లేకుండా DP సెట్ చేసుకోవచ్చు తెలుసా? ఎలాగంటే?
WhatsApp Profile : వాట్సాప్ ఫొటో ప్రొఫైల్ ఫొటోలను అడ్రస్ బుక్‌లోని ఫొటోలతో సెట్ చేసుకోవచ్చు. సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ప్రొఫైల్ ఫొటో లేకపోతే సేవ్ చేసిన ఫొటోలనే సెటప్ చేసుకోవచ్చు..
- Sreehari A
- Published On : April 2, 2026 / 06:16 PM IST
WhatsApp Profile
- వాట్సాప్ యూజర్లకు కోసం అద్భుతమైన డీపీ ఫీచర్
- ప్రొఫైల్ ఫొటో కనిపించకుండా డిఫాల్ట్ డీపీ సెటప్
- యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ టెస్టింగ్
WhatsApp Profile : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక మీ ప్రొఫైల్ ఫొటో ఫుల్ సేఫ్.. ఎవరికి కనిపించకుండా హైడ్ చేయొచ్చు. ఒకవేళ మీ ప్రొఫైల్ డీపీ ఎవరైనా చూసేందుకు ట్రై చేసినా వారికి డిఫాల్ట్ డీపీ మాత్రమే కనిపిస్తుంది.
అది కూడా మీరు ఏది సెట్ చేసుకుంటారో అదే కనిపిస్తుంది. యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. చాలామంది డీపీ కనిపించకుండా హైడ్ చేస్తే అది ఎంప్టీగా కనిపిస్తుంది. అలా కాకుండా వాట్సాప్ డిఫాల్ట్ ఫ్లేస్ హోల్డర్ డిస్ ప్లే అవుతుంది.
వాట్సాప్ యూజర్లు ప్రొఫైల్ ఫోటోను సెట్ చేసుకోనప్పుడు వారి అడ్రస్ బుక్‌లోని ఫోటోను డిస్‌ప్లే చేసేందుకు ఒక ఫీచర్‌ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ డివైజ్‌లో ఇప్పటికే సేవ్ అయిన ఫొటోలలో డిఫాల్ట్ ప్లేస్‌హోల్డర్‌లను రిప్లేస్ చేస్తుంది. ఇక కాంటాక్ట్‌లను గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. “టెస్ట్‌ఫ్లైట్ యాప్‌లో iOS 26.12.10.71 కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్ రిలీజ్ అయింది.
మెయిన్ ప్రొఫైల్ ఫొటో మారదు :
ఒకవేళ వాట్సాప్ యూజర్లు తమ ప్రొఫైల్ ఫొటో సెట్ చేసుకోకపోతే వాట్సాప్ త్వరలో కాంటాక్ట్ కార్డ్‌లో సేవ్ చేసిన ఫొటోను చూపిస్తుందని నివేదిక పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ యూజర్ డివైజ్‌లో మాత్రమే వ్యూ కనిపిస్తుంది. కాంటాక్ట్ అసలు ప్రొఫైల్ ఫొటో మారదు అలాగే ఉంటుంది.
వాట్సాప్‌లో యూజర్లు అనుమతించే కాంటాక్ట్‌లకు మాత్రమే ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ప్రొఫైల్ ఫోటో లేని కాంటాక్ట్‌లను కేవలం వారి పేరు ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా వెంటనే గుర్తుపట్టొచ్చు.
వాట్సాప్ సేవ్ చేసిన కాంటాక్ట్ ఫోటోను రెండు విధాలుగా చూపిస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ అకౌంటులో ప్రొఫైల్ పిక్చర్ లేకపోతే.. సెట్టింగ్స్‌లో మీ అడ్రస్ బుక్‌లో సేవ్ చేసిన ఫొటోను చూపిస్తుంది. ఇది మీకు మాత్రమే కనిపిస్తుంది. ప్రొఫైల్ ఎంప్టీగా కనిపించకుండా ఉండేందుకు డీపీ (DP)లో ఇతరులకు డిఫాల్ట్ ప్లేస్‌హోల్డర్ కనిపిస్తుంది.
ఇలా సెట్ చేసుకోండి :
ఇతర యూజర్లు ‘No One’ లేదా ‘Exept My Contacts’ వంటి ప్రైవసీ సెట్టింగ్ కారణంగా మీ ప్రొఫైల్ ఫొటోను ఎవరూ చూడలేరు. కానీ, అడ్రస్ బుక్‌లో ప్రైవసీ కోసం సేవ్ చేసిన DP ఫొటోను మాత్రమే చూడగలరు.
మీ ప్రైవసీ సెట్టింగ్స్ మీ ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడొద్దనుకుంటే రాబోయే కొత్త ఫీచర్ ప్రైవసీ సెట్టింగ్ ద్వారా లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ అడ్రస్ బుక్‌లో మాన్యువల్‌గా సేవ్ చేసుకున్న ప్రొఫైల్ ఫొటోను మాత్రమే ఇతరులు చూడగలరు.
ప్రొఫైల్ ఫొటో పెట్టుకోవడం ఇష్టంలేని వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి, టెస్ట్ ఫ్లయిట్ నుంచి iOS కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న కొంతమంది బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అడ్రస్ బుక్‌లో ఫోటోలతో ఎంప్టీ ప్రొఫైల్‌లను మార్చుకోవచ్చు. వచ్చే నెలలో ఈ ఫీచర్ అధికారికంగా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి మెటా నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
