Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. జస్ట్ రూ. 1000 పెట్టుబడితో నెలకు రూ. 17,000 సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?
Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద 60ఏళ్లు పైబడినవారు ఇలా పెట్టుబడి పెట్టారంటే మీ ఆర్థిక అవసరాలకు ఇదే డబ్బు ఉపయోగపడుతుంది..
Post Office Scheme
- పోస్టాఫీసులో రూ. 1000 పెట్టుబడితో నెలకు రూ. 17వేలు ఆదాయం
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి?
- ఏడాదికి 8.2 శాతం వడ్డీ, పన్ను రహిత ప్రయోజనాలు
Post Office Scheme : పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? రిటైర్మెంట్ తర్వాత మంచి స్థిరమైన ఆదాయం కోసం చూసేవారికి అద్భుతమైన అవకాశం. పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక అద్భుతమైన పథకం. ఈ పథకం ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన వారి కోసం అందుబాటులో ఉంది. ఇందులో కానీ పెట్టుబడి పెట్టారంటే వృద్ధాప్యంలో ఎలాంటి చింత లేకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి :
ఈ పథకంలో పెట్టుబడి అనేది పూర్గా సురక్షితం. పోస్టాఫీసు ఆమోదిత బ్యాంకుల ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తుంది. మీ డబ్బుకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. ప్రస్తుతం, ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కన్నా ఎక్కువ అనమాట.
చిన్న మొత్తంతో పెట్టుబడిని మొదలుపెట్టడం బెటర్. అకౌంట్ ఓపెన్ చేసేందుకు పెద్ద మొత్తంలో డిపాజిట్ అవసరం లేదు. కేవలం రూ. 1,000 ప్రారంభించి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని ఆర్టికల్ 80C కింద మీరు ఏడాదికి 1.5 మిలియన్ల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఎవరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు? :
60 ఏళ్లు పైబడిన ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు కూడా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. VRS లబ్ధిదారులు (55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు), రక్షణ రంగ విశ్రాంత ఉద్యోగులు (50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు) కూడా పెట్టుబడి పెట్టడానికి అర్హులు.
Read Also : Vivo Y19s 5G Price : వివో లవర్స్ కొనాల్సిన ఫోన్.. ఈ వివో Y19s 5G చాలా చీప్ గురూ.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!
కాలపరిమితి, వడ్డీ 5 ఏళ్లు ఉంటుంది. ప్రతి 3 నెలలకు మీ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది. అవసరమైతే, మెచ్యూరిటీ తర్వాత కాలపరిమితిని 3 ఏళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
ప్రతి 3 నెలలకు రూ. 51,250 ఎలా? :
మీరు ఈ పథకంలో రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే 8.2శాతం వడ్డీ రేటుతో ప్రతి త్రైమాసికానికి రూ. 51,250 పొందుతారు. మీరు నెలకు సుమారుగా రూ. 17,000 స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
5 ఏళ్ల తర్వాత మీ అసలు మొత్తం తిరిగి చెల్లిస్తుంది. మొత్తంమీద, ఈ పథకం సీనియర్ సిటిజన్లకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన పథకం.
ఆదాయపు పన్ను ప్రయోజనాలివే :
ఈ అద్భుతమైన పథకం (SCSS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పొందవచ్చు. తద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే, సంపాదించిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది.
మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు. అంటే.. ఈటీఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఖాతాదారుడు మరణించినప్పటికీ, అకౌంట్ క్లోజ్ అయ్యే వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా మాదిరిగానే అదే రేటుతో ఖాతాపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.
