WhatsApp now lets beta users send high quality videos, here is how
WhatsApp Beta Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఇటీవల యూజర్లందరికి హై క్వాలిటీ ఫొటోలను పంపేందుకు వీలు కల్పిస్తోంది. HD ఫొటో పంపిన తర్వాతవాట్సాప్ ఇప్పుడు HD వీడియోలను పంపే సామర్థ్యాన్ని టెస్టింగ్ చేస్తోంది. వాట్సాప్ యూజర్లకు మెరుగైన మల్టీమీడియా ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటాలో టెస్టింగ్‌లో ఉండగా, ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లు ప్రయత్నించవచ్చు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం..
HD ఫొటోలను పంపే ప్రక్రియ మాదిరిగానే (WABetaInfo) వీడియోల కోసం అప్‌డేట్ చేసిన వాట్సాప్ వెర్షన్ కూడా యాప్ డ్రాయింగ్ ఎడిటర్‌లో ‘HD’ బటన్‌ను చూపిస్తుంది. ఈ వీడియోను పంపే ముందు.. యూజర్లు రెండు వీడియో క్వాలిటీ సెట్టింగ్‌ల మధ్య ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.
డిఫాల్ట్‌గా.. డేటా వినియోగం, స్టోరేజీ స్పేస్ తగ్గాలంటే వాట్సాప్ వీడియోలను కంప్రెస్ చేస్తుంది. అయితే, HD ఆప్షన్ హైక్వాలిటీతో వీడియోలను పంపేందుకు యూజర్లను అనుమతిస్తుంది. రియల్ క్వాలిటీ మాదిరిగా ఉండకపోయినప్పటికీ.. HD క్వాలిటీ వీడియో మాత్రం మెరుగ్గానే ఉంటుంది.
WhatsApp now lets beta users send high quality videos, here is how
ఉదాహరణకు, ప్రామాణిక క్వాలిటీలో వీడియో స్క్రీన్‌షాట్‌ల ప్రకారం.. 416 x 880 పిక్సెల్‌ల కొలతలు, 6.3MB సైజు కలిగి ఉండవచ్చు. అయితే, HD వెర్షన్ 608 x 1296 పిక్సెల్‌ల కొలతలు, 12MB సైజు కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేసేందుకు వాట్సాప్ యూజర్లు వాట్సాప్ బీటా వెర్షన్‌ను ఆండ్రాయిడ్ 2.23.14.10కి అప్‌డేట్ చేయాలి. మీరు వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో భాగమైతే.. ఈ కొత్త ఫీచర్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా, వాట్సాప్ ఇప్పుడు బీటా టెస్టర్‌లను కాంటాక్ట్‌లతో 100 ఫొటోల వరకు షేర్ చేసేందుకుఅనుమతిస్తుంది. ఈ ఫీచర్ యాప్ స్టేబుల్ వెర్షన్‌లో ఇంకా రాలేదు. వాట్సాప్ యూజర్లు ఒకేసారి చాలా ఫొటోలను షేర్ చేయడం చాలా సులభం. ప్రస్తుతం ఈ లిమిట్ 30కి సెట్ అయింది. వాట్సాప్ యూజర్లు కొన్ని ఈవెంట్‌లను షేర్ చేసేందుకు వందలాది ఫొటోలను కలిగి ఉంటే.. షేరింగ్ లిమిట్ చాలా తక్కువగా ఉన్నందున ఫొటోలను షేరింగ్ చేసే ప్రక్రియను రీస్టార్ట్ చేయాలి.