WhatsApp Parental Controls : పిల్లల వాట్సప్‌కు కొత్త రూల్స్.. ఏ గ్రూప్‌లో చేరాలో పేరెంట్సే డిసైడ్!

WhatsApp Parental Controls : టీనేజర్ల సేఫ్టీ కోసం వాట్సప్‌ కొత్త పేరెంటల్‌ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. చాట్స్, గ్రూప్స్, ప్రొఫైల్ పిక్చర్, ఛానెల్స్, స్టేటస్‌లపై పేరెంట్స్ కంట్రోల్ చేయొచ్చు.

  • Published on- September 30, 2026 / 09:05 PM IST

WhatsApp Parental Controls

  • టీనేజర్ల వాట్సప్‌పై పేరెంట్స్‌ కంట్రోల్..
  • టీనేజర్ల వాడకంపై తల్లిదండ్రులకు ఫుల్ కంట్రోల్
  • పిల్లల వాట్సాప్ చాట్స్, గ్రూప్స్‌పైనా నిఘా

WhatsApp Parental Controls : టీనేజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. టీనేజర్ల ఆన్‌లైన్‌ సేఫ్టీని పెంచేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఇకపై పిల్లలు వాట్సాప్ యాప్‌ను ఎలా వాడాలి? ఎవరితో చాట్‌ చేయాలి? ఏ గ్రూపుల్లో చేరాలి?

ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయాలి? వంటి అంశాలపై పేరెంట్స్ మరింత కంట్రోలింగ్ అందించేలా కొత్త పేరెంటల్ కంట్రోల్స్ తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్లతో బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

కొత్త ఫీచర్లతో టీనేజర్లు ఏ వాట్సప్‌ గ్రూపుల్లో చేరాలి? ఎవరితో చాట్‌ చేయాలి అనే విషయాల్లో పేరెంట్స్‌ లిమిట్స్ విధించవచ్చు. పిల్లలు ఏదైనా గ్రూప్‌లో చేరేందుకు లేదా అందులో నుంచి బయటకు రావడానికి ట్రై చేసినా గార్డియన్లకు నోటిఫికేషన్‌ వచ్చేలా సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు. టీనేజర్లు ఉన్న గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినా పేరెంట్స్‌కు సమాచారం అందుతుంది.

తల్లిదండ్రుల చేతుల్లో కంట్రోల్ :
అంతేకాదు.. పిల్లల ప్రొఫైల్‌ పిక్చర్‌ను ఎవరు చూడాలి? వారు ఏ ఛానెల్స్‌ను ఫాలో కావాలి? ఎవరి స్టేటస్‌ చూడాలి? పిల్లలు పెట్టే స్టేటస్‌ అప్‌డేట్స్‌ ఎవరికి కనిపించాలి వంటి ప్రైవసీ సెట్టింగ్స్‌పైనా గార్డియన్లు కంట్రోలింగ్ పెట్టవచ్చు.

Read Also : Google Pixel 11a : గూగుల్ పిక్సెల్ 11a ఫస్ట్ లుక్ లీక్.. పర్పుల్ కలర్‌తో అదిరిపోయే డిజైన్!

స్పెషల్ పిన్ అవసరం :
ఈ సెట్టింగ్స్‌ను మార్చేందుకు పేరెంట్స్ స్పెషల్ పిన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. టీనేజర్లు వాట్సప్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలన్నా పేరెంట్స్‌ పర్మిషన్ అవసరమయ్యేలా కంట్రోలింగ్ రన్ చేయవచ్చు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలోనూ పేరెంట్స్ పర్మిషన్ కోరే విధంగా సెట్టింగ్స్‌ అందుబాటులో ఉంటాయి.

ఇక మెటా ఏఐ కంటెంట్‌ వినియోగంపై కూడా గార్డియన్లు కొన్ని కంట్రోలింగ్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, పేరెంటల్‌ కంట్రోల్స్‌ పెరిగినప్పటికీ వాట్సప్‌ ప్రైవసీ విషయంలో మాత్రం కీలక మార్పు లేదనే చెప్పాలి.

వాట్సాప్ యాప్‌లోని పర్సనల్ మెసేజ్‌లు, కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కొనసాగుతుంది. పేరెంట్స్ కూడా తమ పిల్లల వ్యక్తిగత చాట్స్‌ను రీడ్ చేయలేరు. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.