WhatsApp Profile Pictures : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇతర వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలను స్ర్కీన్‌షాట్ తీయడం కుదరదు!

WhatsApp Android Users : మీ వాట్సాప్ అకౌంట్ ప్రొఫైల్ ఫొటోలను ఇతర ఆండ్రాయిడ్ యూజర్లను స్క్రీన్‌షాట్‌లను తీయకుండా కంట్రోల్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్ల భద్రత దృష్ట్యా ఫీచర్ డిఫాల్ట్ ఆఫ్ చేయడం లేదా మాన్యువల్‌గా ఆన్ చేయడం సాధ్యం కాదు.

WhatsApp will no longer allow Android users to take screenshots of profile pictures

WhatsApp Android Users : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ కాంటాక్టుల ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్‌లను తీయడం ఇకపై అనుమతి ఉండదు. యూజర్ల భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా ఇతర వినియోగదారుల ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్‌లను తీయకుండా ఆండ్రాయిడ్ యూజర్లను వాట్సాప్ బ్లాక్ చేస్తోంది.

Read Also : WhatsApp New Feature : వాట్సప్‌‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌‌షాట్‌ తీయడం కుదరదు!

అయినప్పటికీ, ఐఫోన్ యూజర్లు ఇప్పటికీ ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీయగలరు. అయితే, వాట్సాప్ అకౌంట్లలో సేవ్ చేయని కాంటాక్టుల నుంచి ప్రొఫైల్ ఫొటోలను హైడ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వాట్సాప్ కొత్త చర్యతో ఇతర యూజర్ల ఫొటోలను దుర్వినియోగం చేయకుండా నిరోధిస్తుంది.

నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 2024లో వాట్సాప్ కొత్త ఫీచర్‌పై మెటా అధికారికంగా వెల్లడించలేదు. ముఖ్యంగా, ఈ కొత్త ఫీచర్ డిఫాల్ట్‌గా స్విచ్ ఆన్ అవుతుంది. మీరు మాన్యువల్‌గా ఫీచర్‌ను ఆన్ చేయలేరు లేదా స్విచ్ ఆఫ్ చేయలేరని గమనించాలి. మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేయకపోయినా స్క్రీన్‌షాట్ తీసుకోలేరు.

నిర్దిష్ట యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటో హైడ్ చేయొచ్చు :
మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను నిర్దిష్ట యూజర్ల నుంచి లేదా అందరి నుంచి హైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట కాంటాక్టుల నుంచి ప్రొఫైల్ ఫొటో హైడ్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి. ఇప్పటికే హైడ్ చేసిన కాంటాక్టుల లిస్టుకు కొత్త యూజర్లను కూడా యాడ్ చేసే ప్రతిసారీ ఇదే విధంగా ప్రయత్నించవచ్చు. ఈ ఫీచర్ iOS, Android డివైజ్‌ల్లో వర్క్ అవుతుంది.

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • దిగువ రైట్ కార్నర్‌లో సెట్టింగ్స్ ట్యాబ్‌పై నొక్కండి.
  • Privacy ఆప్షన్ ఎంచుకోండి.
  • ప్రొఫైల్ Photo ఆప్షన్ నొక్కండి.
  • ‘My Contacts Except’ ఎంచుకోండి.
  • మీ ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయాలనుకునే కాంటాక్టులను ఎంచుకోండి.
  • టాప్ రైట్ కార్నర్‌లో Done ఆప్షన్ ట్యాప్ చేయండి.

మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వాటితో సహా మీ ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేసుకోవచ్చు.

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.
  • Settings ట్యాబ్‌పై ట్యాప్ చేయండి.
  • ‘Privacy’ ఆప్షన్ ఎంచుకోండి.
  • Profile Photo ఎంచుకోండి.
  • ’Nobody‘ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ ప్రైవసీ ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడకుండా ఇలా కంట్రోల్ చేయొచ్చు.

Read Also : Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!

ట్రెండింగ్ వార్తలు