WhatsApp New Feature : వాట్సప్‌‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌‌షాట్‌ తీయడం కుదరదు!

WhatsApp Profile Photos : వాట్సాప్‌లో స్క్రీన్‌‌షాట్‌ బ్లాకింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్ల ప్రొఫైల్ ఫొటోలను ఇతర యూజర్లు స్క్రీన్‌షాట్ తీయడం లేదా డౌన్‌లోడ్ చేయలేరు.

WhatsApp New Feature : వాట్సప్‌‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌‌షాట్‌ తీయడం కుదరదు!

WhatsApp might soon stop you from taking screenshots of other profile photos

WhatsApp Profile Photos : వాట్సాప్‌లో మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్ వస్తోంది. యూజర్ల ప్రైవసీకే వాట్సాప్ పెద్దపీట వేస్తోంది. ఈ విషయంలో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అసలు తగ్గడం లేదు. ప్రైవసీ పరమైన సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్ కోసం చాట్ లాక్‌‌ ఫీచర్‌పై పనిచేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్‌లను షేర్ చేయకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు వీలుంటుంది. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్ల ప్రైవసీని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటోంది.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

ఇప్పుడు, వాట్సాప్ త్వరలో ఇతర వినియోగదారుల ప్రొఫైల్ ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తీయకుండా యూజర్లను బ్లాక్ చేయనుందని వాట్సాప్ నివేదిక తెలిపింది. ఇప్పటివరకు, వాట్సాప్ గుర్తుతెలియని యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటోలను హైడ్ చేసే ఆప్షన్ కలిగి ఉంది. కానీ, ఇతర వినియోగదారులు మీ ప్రొఫైల్ ఫొటో స్క్రీన్‌షాట్‌ను తీయకుండా ఆపడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. కానీ, ఇకపై ఆ బ్లాకింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది.

కొత్త ప్రైవసీ ఫీచర్‌పై టెస్టింగ్ :
నివేదిక ప్రకారం.. వాట్సాప్ ప్రస్తుతం ప్రొఫైల్ ఫొటోలను ఇతరులు స్క్రీన్‌షాట్‌లు తీయకుండా ఉండేందుకు కొత్త బ్లాకింగ్ ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కి ఈ సరికొత్త ఫీచర్ యాడ్ అయితే వ్యక్తిగత ఫోటోల అనధికారిక డౌన్‌లోడ్, షేరింగ్‌ చేయకుండా నియంత్రించవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇటీవలే వాట్సాప్ బీటా, గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు వేరొకరి ప్రొఫైల్ ఫొటోను స్క్రీన్‌షాట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నోటిఫికేషన్‌ డిస్‌ప్లే అవుతుందని నివేదిక పేర్కొంది.

నోటిఫికేషన్‌లో ‘యాప్ పరిమితుల కారణంగా స్క్రీన్‌షాట్ తీయడం సాధ్యం కాదు’ అని పాప్ అప్ మెసేజ్ వస్తుందని ఉంది. అయినప్పటికీ, వినియోగదారులు ఫోన్ లేదా కెమెరా వంటి మరో ఫోన్ ఉపయోగించి ఇతరుల వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను క్యాప్చర్ చేయవచ్చునని గమనించాలి. అందువల్ల, అప్‌డేట్ వచ్చిన తర్వాత కూడా యూజర్లు తమ ప్రొఫైల్ ఫోటోల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రొఫైల్ ఫొటోలను స్క్రీన్‌షాట్ పరిమితం చేయడం వెనుక ఉద్దేశ్యాన్ని వాట్సాప్ స్పష్టం చేసింది. వాట్సాప్ ప్లాట్‌ఫారంలో వేధింపుల ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా స్క్రీన్‌షాట్ బ్లాక్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఎంచుకున్న బీటా టెస్టర్‌ల గ్రూపుకు మాత్రమే ఈ ప్రైవసీ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, రాబోయే వారాల్లో ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Read Also : Yamaha RX100 New Avatar : యూత్ ఐకానిక్ బైక్.. యమహా RX100 భారత్‌కు మళ్లీ వస్తోంది.. ఈసారి భారీ ఇంజిన్‌‌తో.. రయ్ రయ్..!