Xiaomi 18 Pro Launch : కెమెరా లవర్స్‌కు పండగే.. ఫోన్ వెనుకా మరో స్క్రీన్.. 200MP కెమెరాతో షావోమీ 18 ప్రో వస్తోందోచ్..!

Xiaomi 18 Pro India Launch : షావోమీ 18 ప్రో త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బీఐఎస్‌లో లిస్టింగ్, 200MP డ్యూయల్ కెమెరాలు, 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సహా అంచనా ఫీచర్ల వివరాలివే..

Xiaomi 18 Pro Launch

షావోమీ 18 ప్రో ఇండియా ఎంట్రీపై కీలక అప్‌డేట్
200MP కెమెరాతో షావోమీ 18 ప్రో వస్తోంది.. BISలో లిస్టింగ్‌
7000mAh బ్యాటరీతో షావోమీ 18 ప్రో స్పెసిఫికేషన్లు ఇవే

Xiaomi 18 Pro Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త సంచలనానికి షావోమీ రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. అదిరిపోయే కెమెరాలు, భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో షావోమీ 18 ప్రో త్వరలో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ భారత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి..

బీఐఎస్ లిస్టింగ్‌తో పెరిగిన అంచనాలు :
మీడియా రిపోర్టుల ప్రకారం.. షావోమీ 18 ప్రో మోడల్ నంబర్ 2609BPN61Iతో BISలో రిజిస్టర్ అయింది. అయితే, ఈ లిస్టులో ఫోన్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. డిసెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, లాంచ్ తేదీపై క్లారిటీ లేదు..

200MP కెమెరాతో అదిరిపోయే ఫొటోగ్రఫీ :
చైనా వేరియంట్‌లో ఉన్న ఫీచర్లే ఇండియన్ మోడల్‌లోనూ ఉండొచ్చని అంచనా. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ముఖ్యంగా 4,000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ ఆకట్టుకునేలా ఉంది. ఈ షావోమీ ఫోన్ బ్యాక్ సైడ్ మరో 2.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కూడా ఉంటుంది.

Read Also : Samsung Galaxy F70 Pro 5G : ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్.. రూ.26వేల శాంసంగ్ 5G ఫోన్ జస్ట్ ఎంతంటే?

కెమెరాల విషయానికి వస్తే.. OIS సపోర్ట్‌తో 200MP ప్రైమరీ కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు.

బ్యాటరీ విషయంలోనూ తగ్గేదేలే.. :
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉండొచ్చని సమాచారం. 7,000mAh బ్యాటరీకి 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తుంది.

కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ పరంగా ఇలా అన్ని కేటగిరీల్లో షావోమీ 18 ప్రో ఆసక్తికరమైన ఫోన్‌గా కనిపిస్తోంది. అయితే, భారత ధర, లాంచ్ తేదీ, పూర్తి ఫీచర్లపై షావోమీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే..