Xiaomi India: షియోమీ ఇండియా జనరల్ మేనేజర్‌గా ఆల్విన్ త్సే

భారతదేశంలో షియోమీ ఆపరేషన్లు చూసుకునేందుకు గానూ సంస్థ ఆల్విన్ త్సేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసింది. రెండేళ్ల క్రితం Pocoకి మారిన అనూజ్ శర్మ మళ్లీ Xiaomi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఇండియాలో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Xiami

Xiaomi India: భారతదేశంలో షియోమీ ఆపరేషన్లు చూసుకునేందుకు గానూ సంస్థ ఆల్విన్ త్సేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేసింది. రెండేళ్ల క్రితం Pocoకి మారిన అనూజ్ శర్మ మళ్లీ Xiaomi చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఇండియాలో చేరనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కంపెనీ ప్రకటించిన సంస్థాగత మార్పులలో భాగంగా, ఆల్విన్ త్సే Xiaomi ఇండియా జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. ఆల్విన్ గతంలో Xiaomi ఇండోనేషియా మాజీ జనరల్ మేనేజర్ గా పనిచేశారు. Tse గతంలో కంపెనీని గ్లోబల్ మార్కెట్‌లలోకి విస్తరించడంలో సహాయపడ్డారు.

కంపెనీ మొత్తం బ్రాండ్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీని హ్యాండిల్ చేస్తూ, అనూజ్ శర్మ Xiaomi ఇండియాలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా మళ్లీ చేరతారని కంపెనీ ప్రకటించింది. శర్మ గతంలో రెండేళ్ల క్రితం స్పిన్‌ఆఫ్ బ్రాండ్ పోకోకు కంట్రీ డైరెక్టర్‌గా మారారు.

Read Also: తప్పుడు యాడ్‌కు షియోమీకి రూ.2లక్షల 26వేల ఫైన్

దేశంలో కంపెనీ ఎదుర్కొంటున్న చట్టపరమైన సవాళ్ల మధ్య Xiaomi ఇండియా సంస్థలో మార్పులు వచ్చాయి . అంతకుముందు జనవరిలో, దిగుమతి పన్నులను ఎగవేసినందుకు $84.5 మిలియన్లు (దాదాపు రూ. 660 కోట్లు) చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కంపెనీకి సూచించింది. ఐటీ శాఖ అధికారులు స్థానిక బ్యాంకుల్లో కంపెనీకి చెందిన $478 మిలియన్ (దాదాపు రూ. 3,700 కోట్లు) విలువైన డిపాజిట్లను కూడా ఆపేసినట్లు రిపోర్టు వెల్లడించింది.