Yamaha EC 06
Yamaha EC 06 : యమహా కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త యమహా EC-06 ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదే యమహా ఈసీ-06 భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. యువ రైడర్ల కోసం యమహా ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ బైకు ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. ఈ స్కూటర్‌ను ఫస్ట్ టైమ్ నవంబర్ 2025లో ముంబైలో జరిగిన ఈవెంటులో ఆవిష్కరించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో యమహా ప్రీమియం ‘బ్లూ స్క్వేర్’ షోరూమ్‌ల ద్వారా యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన ఏథర్, ఓలాకు గట్టి పోటీ ఇవ్వనుంది.
డిజైన్ :
ఈ స్కూటర్ డిజైన్ యమహా సిగ్నేచర్ డిజైన్, అడ్వాన్స్ స్టైలింగ్ అందిస్తుంది. బాడీ లైన్, స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. ప్రీమియం రోడ్ ప్రెజెన్స్ ఇస్తుంది. రైడింగ్ కోసం 3 మోడ్‌లు ఉన్నాయి. అందులో ఎకో, స్టాండర్డ్, పవర్ ఉన్నాయి. ఇంకా, ఇరుకైన ప్రదేశాలలో ఈజీగా పార్కింగ్ చేసేందుకు రివర్స్ మోడ్ కూడా ఉంది.
యమహా 169 కి.మీ రేంజ్ :
యమహా EC-06 బైక్ టాప్ స్పీడ్ సర్టిఫైడ్ రేంజ్ 169 కి.మీ. రోజువారీ ప్రయాణాలకు అద్భుతమైన ఆప్షన్. 4kWh ఫిక్స్‌డ్ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
పవర్‌ఫుల్ మోటారు, పర్ఫార్మెన్స్ :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ IPMSM (ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్) ద్వారా పవర్ పొందుతుంది. పర్ఫార్మెన్స్ గణాంకాలు ఈ EV గరిష్టంగా గంటకు 79 కి.మీ స్పీడ్ అందిస్తుందని సూచిస్తున్నాయి. ఈ మోటార్ గరిష్టంగా 26Nm టార్క్, 6.7 kW టాప్ పవర్ అందిస్తుంది.
3 ఏళ్లు లేదా 30వేల కి.మీ వారంటీ :
ఈ EV బ్యాటరీపై కంపెనీ 3 ఏళ్లు లేదా 30వేల కి.మీ వారంటీని అందిస్తుంది. స్టాండర్డ్ హౌస్ ప్లగ్ ద్వారా ఈజీగా ఛార్జ్ చేయవచ్చు. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు దాదాపు 8 గంటల సమయం పడుతుంది.
వాటర్, డస్ట్ నుంచి ఫుల్ ప్రొటెక్షన్ :
యమహా ఈసీ-06 భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించింది. మోటార్, బ్యాటరీ IP67 సర్టిఫైడ్ పొందింది. ఇతర ఎలక్ట్రానిక్స్ ఐపీ65 సర్టిఫైడ్ కూడా. అంటే.. వర్షం, దుమ్ములో కూడా స్కూటర్ కొంచెం కూడా చెక్కుచెదరదు.
3 రైడింగ్ మోడ్స్, రివర్స్ ఫీచర్ :
యమహా ఈసీ-06 బైక్ మొత్తంగా ఎకో, స్టాండర్డ్, పవర్ అనే 3 రైడింగ్ మోడ్స్ అందిస్తుంది. ఈ మోడ్స్ ద్వారా రైడర్లు మైలేజ్, పర్ఫార్మెన్స్ పొందవచ్చు. రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఇరుకైన ప్రదేశాలలో ఈజీగా పార్కింగ్ చేయొచ్చు.
సేఫ్టీ, సస్పెన్షన్ :
ఫ్రంట్ సైడ్ 200mm డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా ఉంది. ఈ ఫీచర్లతో నగర రోడ్లపై సేఫ్టీ రైడ్
అద్భుతంగా ఉంటుంది.
స్మార్ట్ ఫీచర్లు, కనెక్టివిటీ :
యమహా EC-06లో ఎల్‌సీడీ డిజిటల్ డిస్‌ప్లే ఉంది. స్పీడ్, బ్యాటరీ స్టేటస్, రైడింగ్ మోడ్స్, కనెక్టివిటీ డేటాను అందిస్తుంది. ఈ స్కూటర్ యమహా మోటార్ కనెక్ట్ ఆర్ యాప్‌తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.
24.5 లీటర్ల సీటు కింద స్టోరేజీ కెపాసిటీ :
యమహా స్కూటర్ 24.5 లీటర్ల సీటు కింద భారీ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది. హెల్మెట్లు, బ్యాగులు లేదా రోజువారీ నిత్యావసరాలను సులభంగా ఉంచుకోవచ్చు.