AI: 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయి? 2024లో జరగనున్న అద్భుతాలు ఏంటో తెలుసా?

ఈ ఏడాదిలో ఏఐలో వచ్చిన విప్లవాత్మక మార్పులు 2024లో కృత్రిమ మేధకు మరింత ఊపును ఇవ్వనున్నాయి. ముఖ్యంగా ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

AI Trends-2024

Important Trends-2024: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఈ కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ఏఐతో భవిష్యత్తులో మానవ జీవితానికి ఎంతో ముప్పు పొంచి ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ, వాటిని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. 2023లో కృత్రిమ మేధ ఎంతో ముందుకు దూసుకువచ్చింది.

ఏఐ నామ సంవత్సరంగా 2023ని పిలవవచ్చు. ఏఐ మనిషి రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుండడంతో ఏఐని వాడేవారు విపరీతంగా పెరిగిపోయారు. టీనేజర్లూ కృత్రిమ మేధను బాగా వాడేస్తున్నారు. ఎంతటా అంటే.. యూకేలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో నలుగురు ఏఐ టూల్స్‌ను వాడేస్తున్నారని తాజాగా ఓ డేటా ద్వారా తెలిసింది.

అలాగే, ఆస్ట్రేలియాలోని ఉద్యోగుల్లో మూడింట రెండు వంతుల మంది తమ వృత్తుల్లో ఏఐ వినియోగిస్తున్నారు. ఏఐను మొదట సరదాగా వినియోగించిన వారు ఆ తర్వాత విద్య, సలహాలు, కోడింగ్, ఫొటోలు, వీడియోలు, ఆడియోను సృష్టించడం, ఇతర సమాచారం కోసం వాడుతున్నారు.

Also Read: ప్రపంచంలో 2023లో ఏం జరిగింది? 2024లో ఏం జరగనుంది?

ఇంతమందా?

చాట్‌జీపీటీ 2023లో ప్రపంచంలో సంచలనం సృష్టించింది. 10 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. ఆస్ట్రేలియా మొత్తం జనాభా కంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు మధ్య కాలంలో 14.6 బిలియన్ల మంది చాట్‌జీపీటీని ఓపెన్ చేశారు. 2023లో గూగుల్ చాట్‌బాట్ బార్డ్‌, మైక్రోసాఫ్ట్‌ చాట్‌బాట్ బింగ్ అత్యంత ప్రజాదరణ పొందాయి.

చాట్‌బాట్‌లలో వరుసగా చాట్‌జీపీటీ, క్యారెక్టర్‌ ఏఐ, క్విల్‌ బాట్‌, మిడ్‌జర్నీ, హగ్గింగ్‌ ఫేస్‌ టాప్-5లో ఉన్నాయి. చాట్‌జీపీటీ లేటెస్ట్ ఇటెరేషన్ జీపీటీ-4 ఈ ఏడాది మార్చిలోనే అందుబాటులోకి వచ్చింది. 2023లోనే ఎన్నో దిగ్గజ సంస్థలు ఏఐను మరింత అభివృద్ధి చేసుకునేందుకు పోటీ పడ్డాయి.

2024లో ఏం జరగనుంది?
ఈ ఏడాదిలో ఏఐలో వచ్చిన విప్లవాత్మక మార్పులు 2024లో కృత్రిమ మేధకు మరింత ఊపును ఇవ్వనున్నాయి. ముఖ్యంగా ఈ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

  • కృత్రిమ మేధ సేవలు, ఫంక్షన్ల బండ్లింగ్ పెరగనుంది
  • యూజర్ ఫ్రెండ్లీ ఏఐ టూల్స్ వస్తాయి
  • ప్రజలు మరింత సులభతరంగా ఏఐ సర్వీసులను వాడుకునేలా కంపెనీలు మరిన్ని మార్పులు చేయనున్నాయి
  • ఏఐలో నాణ్యత, రియాలిటీ మరింత పెరగనుంది
  • ఏఐ వినియోగంలో నైతికత పాటించేలా నిబంధనలు రావచ్చు
  • కస్టమర్ సర్వీసులో ఏఐ వినియోగం బాగా పెరగనుంది
  • ఇదే సమయంలో యూజర్ల డేటా చోర్యం వంటి భయాలు పెరిగే ప్రమాదం ఉంది
  • ఉద్యోగుల స్థానంలో కంపెనీలు ఏఐతో పనిచేసుకునే పరిస్థితులు పెరుగుతాయి
  • ఏఐను వాడుకోవాలనుకున్న మీడియా సంస్థలు దాని ద్వారా 2023లో ప్రజలకు నాణ్యమైన సేవలను అందించలేకపోయాయి. 2024లో మాత్రం ఏఐతో కచ్చితమైన, పారదర్శకమైన సేవలను అందించే అవకాశం ఉంది
  • కృత్రిమ మేధకు సంబంధించిన నిబంధనలతో 2024లో ప్రపంచ దేశాల్లో ఏఐ చట్టాలు ఏర్పడే అవకాశం ఉంది
  • 2024లో ఏఐలో పరిశోధన, పెట్టుబడులు, ఫండ్స్, శిక్షణ తరగతులు పెరుగుతాయి

 

Samsung Galaxy A Series : భారత్‌కు శాంసంగ్ గెలాక్సీ ఎ15, గెలాక్సీ ఎ25 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?