×
Ad

AI Chat : ఫుడ్ లవర్స్‌కు పండగే.. ఇక AI చాట్‌తో ఫుడ్ ఆర్డర్.. UPIతో పేమెంట్స్.. అన్నీ ఒకే చాట్‌లోనే!

AI Chat Food Order : Razorpay, NPCI Claudeపై ఏజెంట్ పేమెంట్లు ప్రారంభించాయి. వినియోగదారులు Zomato, Swiggy, Zepto నుంచి UPI రిజర్వ్ పేతో ఏఐ చాట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రదర్శించారు

  • Published On : February 21, 2026 / 02:00 PM IST

AI Chat Food Order

  • రేజర్ పే, ఎన్‌పీసీఐ రియల్-టైమ్ సేఫ్ యూపీఐ పేమెంట్స్
  • ఏఐ ఆధారిత కామర్స్ విస్తరణకు ముఖ్యమైన మౌలిక వసతులు
  • దేశవ్యాప్తంగా ఏజెంట్ పేమెంట్స్ ప్రారంభంపై త్వరలో క్లారిటీ
  • ఏఐతో చాట్‌తో ఆర్డర్ చేసి యూపీఐ రిజర్వ్ పేతో పేమెంట్లు

AI Chat Food Order : ఫుడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏఐ చాట్‌తో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే, యూపీఐతో పేమెంట్ చేసుకోవచ్చు. అతి త్వరలో ఏజెంటిక్ పేమెంట్స్ పేరుతో కొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. రేజర్ పే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ((NPCI) కలిసి ఏఐ ప్లాట్‌ఫామ్ (Anthropic) రూపొందించిన క్లాడ్‌లో “ఏజెంటిక్ పేమెంట్స్” అనే కొత్త సొల్యూషన్‌ను ఏఐ సమ్మిట్‌లో ప్రదర్శించాయి.

ఈ కొత్త సర్వీసు ద్వారా భవిష్యత్తులో ఫుడ్, కిరాణా, రోజువారీ అవసరాలకు వేర్వేరు యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకే AI చాట్‌లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదే చాట్‌లో యూపీఐ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చు. యూపీఐ ఆధారంగా పనిచేసే ఈ సిస్టమ్‌లో “UPI Reserve pay” ఫెసిలిటీ కూడా ఉంది. యూపీఐ యూజర్లు ముందుగానే ఒక లిమిట్ సెట్ చేయొచ్చు. అంటే.. ఆ లిమిట్ లోపల పేమెంట్స్ ప్రతిసారి పిన్ ఎంటర్ చేయకుండానే పూర్తి చేయొచ్చు.

Read Also : Google Pixel 9a : ఖతర్నాక్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10a కన్నా పిక్సెల్ 9a బెటర్ భయ్యా.. ఎందుకంటే?

యూజర్ల చేతుల్లోనే ఫుల్ కంట్రోల్ :
అయినప్పటికీ, ప్రతి ట్రాన్సాక్షన్‌పై ఫుల్ కంట్రోల్, రియల్‌టైమ్ డేటా యూజర్ల చేతుల్లోనే ఉంటుంది. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఆవిష్కరించారు. కొంతమంది ఎంపిక చేసిన యూజర్లతో ఈ ఏఐ చాట్ పైలట్ దశలో ఉంది. అతి త్వరలో విస్తరించే అవకాశం ఉంది. దాంతో వినియోగదారులకు షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా మారే అవకాశం ఉంది.

ఏఐ సమ్మిట్‌లో ఆవిష్కరణ :

ఏఐ సమ్మిట్‌లో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఫుడ్ లేదా జెప్టో నుంచి కిరాణా వస్తువులను ఆర్డర్ చేయడం వంటివి సిస్టమ్ ద్వారా ప్రదర్శించారు. ఏఐ ఏజెంట్ అందుబాటులో ఉన్న ఆప్షన్లను సెర్చ్ చేసి వాటిని యూజర్లకు అందించింది. సింగిల్ కన్ఫార్మేషన్ తర్వాత చెక్అవుట్‌ ఆర్డర్ పెట్టేసింది. ఈ కొత్త విధానంతో మొత్తం ప్రాసెస్ ఒకే చాట్‌ ద్వారా ఆర్డరింగ్, పేమెంట్ చేయొచ్చునని ఇంటిగ్రేషన్ డెవలపర్లు తెలిపారు.

యూపీఐ ఆధారిత సిస్టమ్‌తో ట్రాన్సాక్షన్ సేఫ్టీ, యూజర్ కంట్రోల్ పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీలు తెలిపాయి. Razorpay, NPCI అనే రెండు భారతీయ యూపీఐ ఆధారిత రియల్-టైమ్, సేఫ్ డిజిటల్ పేమెంట్లను అందిస్తున్నాయి. ఏఐ ఆధారిత కామర్స్ బిజినెస్ విస్తరించేందుకు వేగవంతమైన పేమెంట్ సిస్టమ్స్ చాలా కీలకం.

ప్రస్తుతం ఈ డిజిటల్ సర్వీసులు లేదా ఫీచర్లు పైలట్ దశలో మాత్రమే ఉన్నాయా? లేదా దేశవ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అనేదానిపై కంపెనీలు క్లియర్ టైమ్‌లైన్‌ వెల్లడించలేదు. ఈ కొత్త ఏఐ చాట్ ఫీచర్ సాధారణ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా క్లారిటీ లేదు.