YouTube HD Videos: వీడియోలు తీరిగ్గా చూడాలంటే డబ్బులు చెల్లించాలట!!

లో, మీడియం, హై, ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ ఎలాంటి వీడియో కావాలన్నా డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో వీక్షించే వీలుంది. కానీ, తాజా నిర్ణయంతో లెక్కలు మారనున్నాయి.

YouTube HD Videos: సాధారణంగా బోర్ కొడితే యూట్యూబ్ ఓపెన్ చేసి నచ్చిన వీడియోలను చూస్తూంటాం. అలా కాకుండా ప్రత్యేకించి ఏదైనా వీడియో కావాలంటే ఎంతసేపైనా సెర్చ్ చేసి చూసిన తర్వాతే సంతృప్తి పడతాం. మరి నెట్ వర్క్ అంతగా ఉండని ప్రాంతంలో చూడాలంటేఆగి ఆగి వీడియో ప్లే అయ్యే సమస్య నుంచి బయటపడటానికి డౌన్ లోడ్ ఆప్షన్ పెట్టి తర్వాత చూస్తాం.

ఇలా చూడటానికి లో, మీడియం క్వాలిటీలు మాత్రమే ఇకపై ఫ్రీ. హై క్వాలిటీ వీడియోలకు ఆ అవకాశం ఉండబోదు.

లో, మీడియం, హై, ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ ఎలాంటి వీడియో కావాలన్నా డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్ లో వీక్షించే వీలుంది. కానీ, తాజా నిర్ణయంతో లెక్కలు మారనున్నాయి. వీడియో బఫర్ కాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని చూడాలంటే కచ్చితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ ప్రీమియం కోసం నెలవారీ మనీ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ తాజా నిర్ణయం యూట్యూబ్ కి నచ్చినప్పటికీ యూజర్లకు నచ్చడం లేదు. హెచ్‌డీ వీడియోలు చూడటానికి కూడా ఫ్యూచర్ లో కచ్చితంగా సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే అనే నిబంధన తీసుకొస్తారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు