Hyd Fire Accident: బోయిగూడ ప్రమాదంలో.. మృతుల వివరాలు..!
సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో.. మృతుల పూర్తి వివరాలను పోలీసులు గుర్తిస్తున్నారు.
- Ravikanth 10tv
- Published On : March 23, 2022 / 09:07 AM IST
Bhoiguda Fire Accident:
Hyd Fire Accident: సికింద్రాబాద్ లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో.. మృతుల వివరాలను పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. చనిపోయిన 11 మంది పేర్లు వారి వయసు వివరాలివి. వీరిలో చాలా మంది బిహార్ కు చెందిన వారు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
మృతుల పేర్లు – వయసు:
- సికిందర్ – 40
- బిట్టూ – 23
- సతేంధర్ – 35
- గొల్లు – 28
- దామోదర్ – 27
- చింటూ – 29
- రాజేష్ – 25
- దీపక్ – 26
- పంకజ్ – 26
- దినేష్ – 35
- రాజేష్ – 25
నిన్న అర్థరాత్రి 2 గంటల తర్వాత.. బోయిగూడలోని ఓ స్క్రాప్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. 11 మంది సజీవ దహనం కాగా.. ఓ కార్మికుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందిన వెంటనే.. 8 ఫైర్ ఇంజిన్ల సాయంతో.. అధికారులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఉదయం 6 గంటల లోపు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి తలసాని.. ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
Read More:
Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం
Hyd Fire Accident: ప్రమాదం బాధాకరం.. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి తలసాని
