12 year old boy commits suicide in Hyderabad
Hyderabad: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. 12 ఏళ్ళ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫోన్ చూడొద్దని, వీడియో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించాడని బాలుడు ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే, బంజారాహిల్స్(Hyderabad) రోడ్డు నంబర్ 12లోని సయ్యద్ నగర్‌లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.
ఆ బాలుడి తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ పని చేసుకుంటే కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. మహ్మద్ అఫాన్ ఖాన్ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ప్రస్తుతం మారు తల్లి వద్ద పెరుగుతున్నాడు. చిన్నప్పటినుంచి చిన్నప్పుడే మంకు పట్టు ఎక్కువ. తండ్రి దేనిగురించైనా చెప్తే అస్సలు వినేవాడు కాదు. అలాగే, ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉండేవాడు, వీడియో గేమ్ ఆడుతూ స్కూల్‌కు డుమ్మా కొడుతూ ఉండేవాడు. ఆ కారణంగానే ఇప్పటికే మూడు స్కూల్స్ కూడా మారాడు మహ్మద్ అఫాన్ ఖాన్.
అది గమనించిన తండ్రి ఇర్ఫాన్ ఖాన్ కొడుకును మందలించాడు. అనంతరం ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి ఫిబ్రవరి 24, మంగళవారం బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. అప్పటికే తండ్రి మందలించిన మనస్తాపంలో ఉన్న అఫాన్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఈమేరకు తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.