Degree Student Arrested: ఈమెను బావిలోకి తోసేసింది డిగ్రీ స్టూడెంట్ .. ఎందుకు చేశావురా అంటే వాడు చెప్పింది విని…
ఆన్‌లైన్ గేమ్స్ బానిసై అప్పులపాలైన డిగ్రీ విద్యార్థి(Degree Student Arrested), దొంగతనం కోసం ఓ వృద్ధురాలిని బావిలోకి తోసేసిన ఘోర ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది.
- V Santhosh Kumar
- Published on- July 5, 2026 / 03:32 PM IST
A degree student due to betting pushed a woman into a well to commit theft.
-
బెట్టింగుల కోసం దొంగతనం చేశాడు.
-
వృద్ధురాలిని బావిలోకి తోసేశాడు.
-
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Degree Student Arrested: ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై అప్పులపాలైన ఒక డిగ్రీ విద్యార్థి(Degree Student Arrested), దొంగతనం కోసం ఓ వృద్ధురాలిని బావిలోకి తోసేసిన ఘోర ఘటన కరీంనగర్‌లో వెలుగుచూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) కరీంనగర్‌లో డిగ్రీ చదువుతూ ఆన్‌లైన్ బెట్టింగుల్లో రూ.4 లక్షలు నష్టపోయాడు. లోన్ యాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక అతను దొంగతనానికి పథకం వేశాడు.
Indian Government: మెటాపై కేంద్రం ఆగ్రహం.. అసభ్య ప్రకటనలపై నోటీసులు.. వివరణ ఇవ్వకపోతే..
ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలి కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మి అనే వృద్ధురాలికి పని ఇప్పిస్తానని నమ్మించి నసుల్తాపూర్ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె వద్ద ఉన్న అర తులం బంగారం, 20 గ్రాముల వెండిని లాక్కుని, వృద్ధురాలిని బావిలోకి తోసేసి పారిపోయాడు. బాధితురాలు దాదాపు 21 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో కొట్టుమిట్టాడగా, మరుసటి రోజు ఉదయం గమనించిన గ్రామస్తులు ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, నిందితుడు వాడిన ర్యాపిడో బైక్ బుకింగ్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద దినేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దోచుకున్న బంగారాన్ని రూ.30 వేలకు కొనుగోలు చేసిన టవర్ సర్కిల్ వ్యాపారి వేణు మనోహరాచారిని కూడా పోలీసులు గుర్తించారు. నిందితుడితో పాటు ఆ బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
