Hyderabad : అద్దె ఇల్లు చూడటానికి వెళ్లి రాసలీలలు
అయితే పైఅంతస్తుకు వెళ్లిన ఆ జంట ఎంతసేపైనా కిందికి రాకపోయే సరికి ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇక ఓనర్ సెకండ్ ఫ్లోర్ కు వెళ్లి చూసే సరికి ఆ జంట రాసలీలల్లో మునిగిపోయింది.
- bheemraj
- Published On : May 2, 2022 / 08:18 PM IST
Hyderabad (2)
Hyderabad SR Nagar : హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో ఓ ఇల్లు అద్దెకు చూడటానికి వెళ్లి యువతీ యువకుడు అసభ్యంగా ప్రవర్తించారు. ఎస్ ఆర్ నగర్ లో యువతీ యువకుడు అద్దె ఇల్లు చూసేందుకు వెళ్లారు. సెకండ్ ఫ్లోర్ లో ఇల్లు అద్దెకు ఉందని ఇంటి యజమాని చెబితే చూసి వస్తామని అతని వద్ద తాళం తీసుకున్నారు.
అయితే పైఅంతస్తుకు వెళ్లిన ఆ జంట ఎంతసేపైనా కిందికి రాకపోయే సరికి ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఇక ఓనర్ సెకండ్ ఫ్లోర్ కు వెళ్లి చూసే సరికి ఆ జంట రాసలీలల్లో మునిగిపోయింది. ఇద్దరూ సరసాలాడుతూ కనిపించారు.
Extramarital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
దీంతో ఓనర్ వారి పాడు పని చూసి ఆగ్రహించారు. ఇంటి యజమాని గట్టిగా వారిపై అరిచాడు. ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో యువతీయువకుడు బయటికి పరుగు తీశారు.
