Warangal : లవ్ చీటింగ్ కేసు.. మాయలేడి చేతిలో చాలామంది మోసపోయారు.

వరంగల్ మాయలేడి ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతుంది. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె చేతిలో మోసపోయినవారి సంఖ్య భారీగానే ఉందని పోలీసులు నిర్దారించారు.

Warangal

Warangal : వరంగల్ జిల్లా లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసిన మాయలేడి ఘటనలో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. పోలీసుల విచారణ కళ్ళుబైర్లుకమ్మే విషయాలు బయటపడుతున్నాయి. ప్రేమ పేర సందీప్ కుమార్ అనే యువకుడిని వేధించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు మరికొందరు కూడా ఈ మాయలేడి వలలో చుక్కుక్కునట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె మాటలకూ మైమరిచిపోయిన వారిలో వరంగల్ వాసులు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. డబులు లాగడమే లక్ష్యంగా అమాయకుల జీవితాలతో ఆమె అడుకున్నట్లు తెలుస్తుంది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మిపురానికి చెందిన ఓ యువతి బీటెక్ చదువుతూనే మాయలేడిగా మారింది. డబ్బులు సంపాదించాలనే ఆశతో తన ఫ్రెండ్ సోదరుడికే వలవేసింది. రాయపర్తి మండలం మెరిపిరాల గ్రామానికి చెందిన తన స్నేహితురాలి అన్న సందీప్ కుమార్ కు ఫోన్ చేసింది. ముగ్గురు వేరు వేరు యువతుల పేర్లతో అతడికి ఫోన్ కాల్స్ చేసి ముగ్గులోకి లాగింది.

ముగ్గురిలో ఓ యువతి పురుగుల మందు తాగి మృతి చెందిందని బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో భయపడిపోయిన సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కిలాడీ లేడిని అదుపులోకి తీసుకోని ఆమె మోసాలను బయటకు తెస్తున్నారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన వరంగల్ పోలీసులు సైబర్ క్రైం బృందాలను కూడా రంగంలోకి దింపి కీలక ఆధారాలు సేకరించారు. మాయలేడి బాధితుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.