Hyderabad Old City : హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అర్ఫాత్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే అడ్వకేట్ అర్ఫాత్ తో గొడవ పడ్డాడు.
- bheemraj
- Published On : June 18, 2023 / 10:00 AM IST
Gun Fire
Gun Opened Fire : హైదరాబాద్ లోని పాతబస్తీలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. మీర్ చౌక్ లో ఇంటి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మసూద్ అలీ అనే అడ్వకేట్ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. అర్ఫాత్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది.
ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా.. ఎలా కొంటారని పొరుగింటి వారు గొడవకు దిగారు. ఇదే విషయంపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, గత శనివారం మరోసారి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లో అర్ఫాత్ ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం అర్ధరాత్రి మసూద్ అలీ అనే అడ్వకేట్ అర్ఫాత్ తో గొడవ పడ్డాడు.
Artificial Intelligence : కృత్రిమ మేధస్సుతో మానవాళికి ముప్పు!
అయితే, వారిని భయపెట్టేందుకు తన దగ్గరున్న తుపాకీతో మసూద్ అలీ గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
