China Loan Apps Scam: నకిలీ పేర్లతో రూ.1400కోట్ల నిధుల తరలింపు

చైనా లోన్ యాప్స్ స్కామ్‌లో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. నకిలీ బిల్స్, సర్టిఫికెట్స్ ద్వారా రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించిన సమాచారంతో సీసీఎస్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు..

Loan App Scam

China Loan Apps Scam: చైనా లోన్ యాప్స్ స్కామ్‌లో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. నకిలీ బిల్స్, సర్టిఫికెట్స్ ద్వారా రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించారనే సమాచారంతో ఈడీ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విదేశాలకు మళ్లించిన కేసులో బ్యాంక్ అధికారులను ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారించింది.

బ్యాంక్ అధికారులు ఇచ్చిన వివరాల ఆధారంగా పలు కీలక అంశాలు సేకరించింది. నిందితులు నకిలీ ఎయిర్ బిల్స్, నకిలీ 15CB సర్టిఫికెట్లు తయారుచేసి బ్యాంకుల్లో సబ్మిట్ చేసి విదేశాలకు మళ్లించినట్లుగా తెలుస్తోంది.

హాంకాంగ్, మారిషస్ దేశాలకు రూ.1400 కోట్ల వరకూ నిధులను ట్రాన్స్‌ఫర్ చేశారని సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

…………………………… : కాజీపేట క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు మృతి