Warangal : కాజీపేట క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు మృతి
కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Warangal
Warangal : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతులు ముకేశ్, చందు, జార్ఖండ్‌కు చెందిన ఎండీ ఆఖీమ్‌గా గుర్తించారు.ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాధానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
చదవండి : Road Accident : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చదవండి : Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్ధిని మృతి